6GB ర్యామ్, 512GB స్టోరేజ్, 40 Mp కెమెరా, సంచలనపు ఫోన్ 27న వస్తోంది..

Written By:

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనాకు చెందిన హువావే పి20 ప్రొ పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. కాగా ఈ ఫోన్ 512 జీబీ స్టోరేజీతో వస్తున్నట్లు సమాచారం. కాగా ఈ స్థాయి స్టోరేజ్ తో వస్తున్న తొలి ఫోన్ కూడా ఇదే. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే ఫోన్లను అందిస్తోంది. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం. ఇక పి20లో వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. సర్ఫేస్ ఆన్ లైన్ కూడా ఉంటుంది. 6జీబీ ర్యామ్ ను ఇందులో ఏర్పాటు చేసింది. త్వరలోనే ఇది మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే గనుక మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బడ్జెట్ ధరలో రెండు సెల్ఫీ కింగ్ 4జీ స్మార్ట్‌ఫోన్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

triple-camera setup..

కంపెనీ నుంచి దూసుకువస్తున్న ఈ ఫోన్ ఐఫోన్ ఎక్స్, అలాగే శాంసంగ్ ఎస్9లకు గట్టిపోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. WinFuture రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ Leica-branded triple-camera setupతో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 40 ఎంపీ RGB sensor, 20MP monochrome lens, 8MP telephoto lens ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

స్లో మోషన్ వీడియోలు..

కాగా ఈ ఫోన్లో స్లో మోషన్ వీడియోలు రికార్డు చేయవచ్చని తెలుస్తోంది. సెకనుకు 960 frames రికార్డు చేయవచ్చని సమాచారం. కాగా సెల్ఫీ షూటర్ల కోసం 24 ఎంపీ కెమెరాను పొందుపరచినట్లు తెలుస్తోంది. లీకయిన రిపోర్టుల ప్రకారం iPhone X మాదిరిగానే 6.1-inch OLED displayతో ఫోన్ రానుంది. Kirin 970 processorను నిక్షిప్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ఫోన్ ధర

కాగా ఈ ఫోన్ ధర Eur 899గా ఉండే అవకాశం ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 72,106 ఉంటుందని అంచనా. కాగా ఈ నెల 27న పారిస్ లో జరగనున్న ఈవెంట్లో హువాయి పీ20 లైనప్ ఫోన్లు అయిన P20, P20 Pro and P20 Lineను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

పీ20 లైట్‌ను ..

కాగా కంపెనీ ఇప్పటికే పీ20 లైట్‌ను పోలండ్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫోన్ భారత మార్కెట్‌లోనూ విడుదల కానుంది. రూ.28,355 ధరకు మన దేశంలో ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో 5.84 ఇంచ్ సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డిస్‌ప్లే పై భాగంలో ఐఫోన్ 10 తరహాలో నాచ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 8.0 సరికొత్త ఓఎస్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

16, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను..

ఫోన్ వెనుక భాగంలో 16, 2 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు కెమెరాలను ఏర్పాటు చేయగా, వాటి కింద ఫోన్ మధ్య భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్ రంగుల్లో స్టన్నింగ్ లుక్‌తో ఈ ఫోన్ యూజర్లకు లభ్యం కానుంది.

హువావే పీ20 లైట్ ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, టఫెన్డ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 659 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei P20 Pro to come with 512GB storage, 6GB RAM: Report More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot