హువే పీ20 ప్రొ ఫీచర్స్ అదుర్స్..

Posted By: M KRISHNA ADITHYA

హువే పీ20 ప్రొ స్మార్ట్ ఫోన్ మార్చ్ 27 న మార్కెట్లోకి రానుంది. అదే సమయంలో హువే పీ20 గురించి మార్కెట్లో లీకులు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా బాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే హువే పీ20లో మూడు కెమెరాల సెటప్ ఉంది. అంతేకాదు హువే పీ20 స్మార్ట్ ఫోన్ 40 మెగాపిక్సెల్ రెర్ కెమెరాతోపాటు 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, అలాగే 20 మెగాపిక్సెల్ మోనో క్రోమ్ సెన్సార్, దీంతో పాటు కిరిన్ 970 ఎస్‌వోసీ, 6 జీబీ ర్యామ్, అండ్రాయిడ్ 8.1 వెర్షన్ కలిగి ఉన్నట్లు వార్తలు లీకవుతున్నాయి. అంతేకాదు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్న ఈ ఫోన్ త్వరలోనే మార్కెట్లో ఒక సంచలనంగా మిగిలనుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

అదిరే ఫీచర్లతో ఈ వారంలో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్లు ఇవే

హువే పీ20 ప్రొ ఫీచర్స్ అదుర్స్..

విన్ ఫ్యూచర్ రిపోర్ట్ ప్రకారం.. హువే పీ20ప్రో కోడ్ చార్లోట్ పేరిట ఉండగా. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు కెమెరాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంతేకాదు, మొత్తం 40 మెగాపిక్సెల్ కెమెరాతో కలిగి ఉండటంతో పాటు అత్యధిక మెగాపిక్సెల్ కెమెరా కలిగి ఉన్న ఫోన్ గా హువే పీ20 గా పేరు నమోదు చేసుకోనుంది. గతంలో నోకియా నుంచి వచ్చిన 41 మెగాపిక్సెల్ కలిగిన నోకియా 808, లుమియా 1020 మాత్రమే దీనికి పోటిగా నిలవనున్నాయి. అంతేకాదు దీంతో పాటు ఈ కెమెరాలో 5X హైబ్రిడ్ జూమ్ ఒక విశిష్టతగా చెప్పుకోవచ్చు. అంటే ఆప్టికల్, అలాగే హైబ్రిడ్ జూమ్ వల్ల ఒక కొత్త వినూత్నమైన క్లారిటీతో ఫోటో తీసుకునే వీలుంది. అంతే కాదు ఈ స్మార్ట్ ఫోన్ లో లీకా బ్రాండ్ కెమెరా లెన్స్ వాడినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఆటో ఫోకస్ రేంజ్ ఎఫ్/1.6 నుంచి ఎఫ్/2.4గా ఉంది.

అలాగే మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. అలాగే ఎక్స్ డీఏ డెవలపర్స్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫోన్ లో స్లోమోషన్ వీడియోస్ ను 720 పిక్సెల్ క్లారిటీతో 960 ఎఫ్పీఎస్ వద్ద రికార్డు చేసుకునే వీలుంది. అలాగే ఫ్రంట్ కెమెరా 24 మెగా పిక్సెల్ అని రిపోర్టులు వెలువడ్డాయి.

ఇక డిస్ ప్లే విషయానికి వస్తే హువే పీ20 ప్రొ 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ పానెల్ తో పాటు 1080X2240 రిజల్యూషన్ తో పాటు 19:9 యాస్పెక్ట్ రేషియో డిస్ ప్లే కలిగి ఉంది. కలర్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోగా, ఫుల్ హెచ్ డీ ఈ డిస్ ప్లే విశేషంగా చెప్పుకోవచ్చు.

English summary
Huawei P20 Pro Leak Reveals Triple Camera Setup With 40-Megapixel Primary Sensor
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot