టాప్ క్లాస్ కెమెరా.. ఈ ఫోన్ సొంతం

విప్లవాత్మక ఫీచర్లతో Huawei తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'పీ9'ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.39,999. ప్రీమియమ్ లుక్స్‌తో పాటు పవర్ ప్యాకుడ్ స్సెసిఫికేషన్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు Leica సమకూర్చిన హైక్వాలిటీ డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

టాప్ క్లాస్ కెమెరా.. ఈ ఫోన్ సొంతం

కెమెరా లెన్స్ తయారీలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న Leica హువావేతో కలిసి పనిచేయటమనేది స్మార్ట్‌ఫోన్ కెమెరాల విభాగంలో ఓ విప్లవాత్మక ముందడుగుగా భావించాల్సి ఉంది. ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న వన్‌ప్లస్‌3 స్మార్ట్‌ఫోన్‌కు Huawei P9 అన్ని విధాలుగా పోటీనిస్తోంది. ఈ ఫోన్‌ల మధ్య spec comparisonను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి హువావే పీ9 అల్యుమినియమ్ మెటల్ బాడీ డిజైన్‌తో ప్రీమియమ్ లుక్‌లో కనిపిస్తుంది. మరోవైపు వన్‌ప్లస్3 మెటల్ బాడీ డిజైన్ విత్ నాన్ రిమూవబుల్ బ్యాకప్ ప్యానల్‌తో వస్తోంది.

#2

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.. హువావే పీ9 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ వచ్చేసరికి  1920×1080 పిక్సల్స్. మరో వైపు వన్‌ప్లస్3 ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ వచ్చేసరికి 1920×1080 పిక్సల్స్.

#3

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి హువావే పీ9 ఫోన్ ఆక్టా‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ 64-బిట్ ఆర్మ్ బేసిడ్ ప్రాసెసర్‌తో కూడిన Kirin 955 SoCతో వస్తోంది. మరోవైపు వన్‌ప్లస్3 ఫోన్ క్వాడ్ కోర్ చిప్‌లతో కూడిన స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్‌తో వస్తోంది.

#4

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. భారత్‌లో లభ్యమవుతోన్న హువావే పీ9 ఫోన్ 3జీబి ర్యామ్ అలానే 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. మరోవైపు వన్‌ప్లస్3 ఫోన్ 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తోంది. ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ లేదు.

 

#5

కెమెరా విషయానికి వచ్చేసరికి.. Huawei P9 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ కెమెరా Leica lensతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ అద్బుతమైన ఇమెజ్ క్వాలిటీతో తక్కువ వెళుతురులోని హై క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాలో Leica SUMMARIT H 1:2.2/27 aspherical లెన్స్‌తో పాటు 1.25 మైక్రాన్ పిక్సల్ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. డీఎస్ఎల్ఆర్ క్వాలిటీ తరహా ఫోటోలను ఈ కెమెరా ఆఫర్ చేయగలదు. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను మీరు చూడొచ్చు. ఇదే సమయంలో వన్‌ప్లస్3 ఫోన్.. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

 

#6

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి... ఈ రెండు స్మార్ట్‌ఫోన్ నాన్ రిమూవబుల్ 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలతో వస్తున్నాయి. Huawei P9 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన కైరిన్ 955 చిప్‌సెట్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాటరీ సేవింగ్, క్విక్ చార్జ్ టెక్నాలజీ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి

#7

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

Huawei P9 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ Marshmallow ఆధారంగా అభివృద్థి చేసిన నేటి యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. మరోవైపు వన్‌ప్లస్3 ఫోన్ కూడా ఆండ్రాయిడ్ Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

 

#8

స్పెసిఫికేషన్స్ అలానే ఫీచర్స్ పరంగా Huawei P9 మంచి మార్కులను కొట్టేసిందనే చెపాలి. క్లాస్ అల్యుమినియమ్ మెటల్ బాడీ డిజైన్ తో పాటు టాప్ లైన్ స్సెసిఫికేషన్స్ అలానే అద్భుతమైన Leica కెమెరా వంటి అంశాలు పీ9 స్మార్ట్‌ఫోన్‌ను అగ్రస్థానంలో నిలిపాయి. వన్‌ప్లస్3 ఫోన్ లో మెటల్ బాడీ డిజైన్ ఆకట్టుకున్నప్పటికి కెమెరా విభాగంలో వెనుకబడి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei P9 gives tough completion to Oneplus 3 in specs and camera department. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot