leica కెమెరాతో సామ్‌సంగ్‌కు షాకిచ్చిన Huawei ఫోన్

|

Huawei తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'హువావే పీ9'ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.39,999. ప్రీమియమ్ లుక్స్‌తో పాటు పవర్ ప్యాకుడ్ స్సెసిఫికేషన్స్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు Leica సమకూర్చిన హైక్వాలిటీ డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

 
ప్రపంచంలోనే బెస్ట్ బెస్ట్ కెమెరా ఫోన్ ఇదే!

మార్కెట్లోని టాప్-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకైటైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7తో హువావే పీ9 పోటీ పడుతోంది. సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌ను రూ.48,900 ధర ట్యాగ్‌తో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఫోన్‌ల మధ్య spec comparisonను ఇప్పుడు చూద్దాం..

డిస్‌ప్లే విషయానికి వస్తే..

డిస్‌ప్లే విషయానికి వస్తే..

Huawei P9 స్మార్ట్‌ఫోన్ 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920× 1080పిక్సల్స్, 423 పీపీఐ పిక్సల్ డెన్సిటీ. ఇదే సమయంలో గెలాక్సీ ఎస్7.. 5.1 అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది.

 

ప్రాసెసింగ్ పవర్ విషయానికి వచ్చేసరికి...

ప్రాసెసింగ్ పవర్ విషయానికి వచ్చేసరికి...

Huawei P9 స్మార్ట్‌ఫోన్ కంపెనీ సొంతంగా తయారు చయబడిన కైరిన్ 955 సాక్ విత్ ఆక్టా‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ 64 బిట్ ఆర్మ్ బేసిడ్ ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ ప్రాసెసర్ మృదువైన పనితీరును కనబరుస్తుంది. మరోవైపు గెలాక్సీ ఎస్7 ఎక్సినోస్ 8890 చిప్‌సెట్‌తో వస్తోంది.

 

స్టోరేజ్ కెపాసిటీ విషయానికొచ్చే సరికి..
 

స్టోరేజ్ కెపాసిటీ విషయానికొచ్చే సరికి..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 4జీబి ర్యామ్‌తో వస్తున్నాయి. Huawei P9 స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం 32జీబిగా ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా పెంచుకునే అవకాశం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మంచి స్టోరేజ్ కెపాసిటీతో వస్తున్నాయి.

కెమెరా విషయానికి వచ్చేసరికి...

కెమెరా విషయానికి వచ్చేసరికి...

Huawei P9 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ కెమెరా Leica lensతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ అద్బుతమైన ఇమెజ్ క్వాలిటీతో తక్కువ వెళుతురులోని హై క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాలో Leica SUMMARIT H 1:2.2/27 aspherical లెన్స్‌తో పాటు 1.25 మైక్రాన్ పిక్సల్ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. డీఎస్ఎల్ఆర్ క్వాలిటీ తరహా ఫోటోలను ఈ కెమెరా ఆఫర్ చేయగలదు. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను మీరు చూడొచ్చు. ఇదే సమయంలో గెలాక్సీ ఎస్7.. 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీలతో వస్తున్నాయి. Huawei P9 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన కైరిన్ 955 చిప్‌సెట్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాటరీ సేవింగ్, క్విక్ చార్జ్ టెక్నాలజీ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. మరోవైపు గెలాక్సీ ఎస్7 ప్రత్యేకమైన క్విక్ చార్జ్, బ్యాటరీ సేవింగ్ మోడ్‌లతో వస్తోంది.

 

Best Mobiles in India

English summary
Huawei P9 with Dual Leica camera takes the competition against Samsung Galaxy S7 to another level. Read More in Telugu Gizbot...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X