విప్లవాత్మక కెమెరా స్టాండర్డ్స్‌తో Huawei P9

|

ఇన్నోవేటివ్ టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో కొత్తదనంతో నిండిన స్మార్ట్‌ఫోన్‌లకు రోజురోజుకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో క్రియేటివిటీకి పెద్దపీట వేస్తోన్న ఫోన్ తయారీ కంపెనీలు ఆధునిక అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాయి.

 
విప్లవాత్మక కెమెరా స్టాండర్డ్స్‌తో Huawei P9

బెస్ట్ టెక్నాలజీకి ఇన్నోవేటివ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను జోడిస్తూ.. ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోన్న Huawei మార్కెట్ ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. ఈ సంస్థకు చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పేటెంట్ హక్కులు ఉన్నాయి. తాజాగా హువావే తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ Huawei P9ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చంది. బెస్ట్ క్వాలిటీ యూజర్ ఎక్స్ పీరియన్స్ తో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.39,999గా ఉంది.

#1

#1

Huawei P9 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన Leica lensతో కూడిన డ్యుయల్ కెమెరా వ్యవస్థతో వస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ అద్బుతమైన ఇమెజ్ క్వాలిటీతో తక్కువ వెళుతురులోని హై క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది.

#2

#2

ఈ కెమెరాలో Leica SUMMARIT H 1:2.2/27 aspherical లెన్స్‌తో పాటు 1.25 మైక్రాన్ పిక్సల్ వ్యవస్థను నిక్షిప్తం చేసారు. ఈ కెమెరాలో పొందుపరిచిన సెలక్టివ్ ఫోకస్ టెక్నాలజీ ఫీల్డ్ డెప్త్‌ను నేర్పుగా ఉపయోగించుకుని హైక్వాలిటీ ఫోటోగ్రఫీ రిజల్ట్స్‌ను చేరువచేస్తుంది.

#3
 

#3

ప్రొఫెషనల్ డీఎస్ఎల్ఆర్ కెమెరా తరహాలో Bokeh effectsతో ఈ కెమెరా ఫోటోలను క్యాప్చుర్ చేయగలదు. అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను Huawei P9 కెమెరా ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు.

#4

#4

ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే.. 5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, . స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920× 1080పిక్సల్స్, 423 పీపీఐ పిక్సల్ డెన్సిటీ, కైరిన్ 955 సాక్ విత్ ఆక్టా‌కోర్ 2.5గిగాహెర్ట్జ్ 64 బిట్ ఆర్మ్ బేసిడ్ ప్రాసెసర్‌,

#5

#5

4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని మరింతగా పెంచుకునే అవకాశం, ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్.

Best Mobiles in India

English summary
Huawei P9 with the dual Leica lens sets new camera standards, disrupts smartphone market. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X