భవిష్యత్ గుట్టు విప్పిన Huawei

విప్లవాత్మక ఆవిష్కరణలతో పాటు ఆసక్తికర టెక్నాలజీలను నిత్యం స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయం చేస్తూ మార్కెట్లో తనదైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న Huawei ప్రపంచ బ్రాండ్‌లకు నూతన సవాళ్లను విసురుతోంది.

భవిష్యత్ గుట్టు విప్పిన Huawei

చైనాకు చెందిన ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ కంపెనీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో నికరమైన వృద్థిని నమోదు చేస్తూ సుపీరియర్ క్వాలిటీ ఉత్పత్తులను అందిస్తోంది. తన భవిష్యత్ అవసరాలకు ఎంతో అవసరమైన పేటెంట్ టెక్నాలజీని రోజురోజుకు విస్తరించుకుంటూ అటు చైనాలోనే కాకుండా, ఇటు ఓవర్‌సీస్‌లోనూ Huawei అత్యధిక పేటెంట్ హక్కులను కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

9,000 పై చిలుకు గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్‌లు

మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో నెం.1గా నిలిచే లక్ష్యంతో హువావే.. 9,000 పై చిలుకు గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్‌లతో కన్స్యూమర్ టెక్నాలజీస్ విభాగంలో తిరుగులేని ఆధిపత్యంతో దూసుకుపోతోంది.

రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ నిమిత్తం

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని Huawei తన రాబడిలో 10 శాతం బడ్జెట్‌ను రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు కేటాయిస్తోంది. వెల్లడైన గణాంకాల ప్రకారం 2015లో రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ నిమిత్తం 9.2 బిలియన్ డాలర్లను హువావే వెచ్చించినట్లు సమచారం.

 

2015 చివరినాటికి

కొత్త టెక్నాలజీతో పాటు విప్లవాత్మక ప్రోడక్ట్స్ ఇంకా వైర్‌లెస్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లను ప్రపంచానికి అందించాలన్నది హువావే సంకల్పం. 2015 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 50,377 పేటెంట్‌లను హువావే కొనుగోలు చేసింది. 2016లోనూ ఈ ఒరవడి కొనసాగుతూనే ఉంది.

టెలికామ్ క్యారియర్ నెట్‌వర్క్ వ్యాపారంలో

టెలికామ్ క్యారియర్ నెట్‌వర్క్ వ్యాపారంలో తన సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకున్న Huawei తన ఆదాయ వనరులను మరింత పెంచుకుంది. ముఖ్యంగా 4జీ మార్కెట్లో హువావే తన ఉనికిని చాటుకుంది.

 

గ్లోబల్ మార్కెట్లో 46శాతం వాటా

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 154 4G నెట్‌వర్క్‌లను నెలకొల్పిన హువావే గ్లోబల్ మార్కెట్లో 46శాతం వాటాను కలిగి ఉంది.

అడ్వాన్సుడ్ 4జీ టెక్నాలజీ ఫీల్డ్

ఆధునిక టెక్నాలజీల అన్వేషణ నిమిత్తం నిత్యం తన ఆలోచనలకు పొదును పెడుతూనే ఉన్న హువావే ప్రస్తుతం అడ్వాన్సుడ్ 4జీ టెక్నాలజీ ఫీల్డ్ పై దృష్టిని కేంద్రీకరించింది.

5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుబడులు

త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోన్న 5జీ టెక్నాలజీ నిమిత్తం 2018 నాటికి 600 మిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో వెచ్చించాలని హువావే భావిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Huawei patent technology: How the company has emerged as global leader in filing maximum patents. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot