ఈసారి గ్యారంటీగా సక్సెస్ కొడతాం..

Posted By: Staff

ఈసారి గ్యారంటీగా సక్సెస్ కొడతాం..

అంతర్జాతీయ మార్కెట్లోకి హువాయ్ కంపెనీ యూజర్స్‌కు అనుకూలంగా రూపొందించిన ఓ సరిక్రొత్త మొబైల్ ఫోన్‌ని విడుదల చేసింది. దాని పేరు హువాయ్ పిల్లర్. డిస్ ప్లే సైజు 2 ఇంచ్‌లు. స్క్రీన్ రిజల్యూషన్ 320 x 240 ఫిక్సల్‌గా రూపొందించబడింది. 0.3 మెగా ఫిక్సల్ కెమెరా దీని సొంతం. కెమెరా ఫీచర్స్ లలో డిజిటల్ జూమ్ ప్రత్యేకం. ఈ మొబైల్ కోసం క్వర్టీ కీప్యాడ్‌ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ మొబైల్ బ్లాక్ కలర్‌లో మాత్రమే లభ్యమవుతుంది. దీని బరువు 99 గ్రాములు.

ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ MP3, AA3 ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 900mAh బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. దీంతో 4.50గంటల పాటు టాక్ టైమ్‌ని అందిస్తుంది. నావిగేషన్ కోసం ఇందులో జిపిఎస్ టెక్నాలజీని ఇమిడికృతం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమెరీని విస్తరించుకొవచ్చు. బ్లూటూత్, యుఎస్‌బి రెండు కనెక్టివిటీ ఫీచర్స్‌ని సపోర్ట్ చేస్తుంది. బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ప్రస్తుతానికి వెల్లడించ లేదు. మొబైల్ టెక్నాలజీ బ్లాగుల ప్రకారం సుమారుగా దీని ధర రూ 2,000 నుండి రూ 3,000 వరకు ఉండవచ్చునని అంచనా మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot