డైమండ్ సిరీస్‌ నుంచి అత్యుత్తమ స్మార్ట్ పోన్‌!!

Posted By: Super

డైమండ్ సిరీస్‌ నుంచి అత్యుత్తమ స్మార్ట్ పోన్‌!!

 

2012 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసించేందుకు హువావీ (Huawei) ముఖ్య ప్రణాళికలను రిచిస్తోంది. ఇటీవల నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ఈ బ్రాండ్ డైమండ్ సిరీస్ నుంచి ఓ అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. శామ్‌సంగ్ గెలక్సీ, నోకియా లూమియాలకు ధీటుగా, వినియోగదారుల అంచనాలను తగ్గట్టుగా ఈ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేశారు. ఫిబ్రవరి 26ను జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ద్వారా ఈ డివైజ్ మార్కెట్లోకి రానుంది.

డైమండ్ సిరీస్ నుంచి ‘హువావీ ఎసెండ్ పీ1’ మోడల్‌లో వస్తున్న ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైజ్ శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థను ఒదిగి ఉంది. లోడ్ చేసిన 1.5GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ సమర్దవంతమైన పనితీరుతత్వాన్ని కలిగి ఉంటుంది. 4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ ధృడమైన గొరిల్లా గ్లాస్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ క్వాలిటీ ఫోటోగ్రఫీని అందిస్తుంది. మొబైల్ ముందు భాగంలో అనుసంధానించిన 1.3 మెగా పిక్సల్ కెమెరా ప్రత్యక్ష వీడియో

ఛాటింగ్‌కు దోహదపడుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot