Home
Mobile

బడ్జెట్ ధరలో మార్కెట్లోకి లాంచ్ కానున్న హానర్‌ 7S

హువాయి సబ్ బ్రాండ్ హానర్ మార్కెట్లో దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది . అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ ను ఈ రోజు లాంచ్ చేయనుంది

By Anil

హువాయి సబ్ బ్రాండ్ హానర్ మార్కెట్లో దిగ్గజాలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది . అత్యంత తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు ఉన్న ఫోన్ ను ఈ రోజు లాంచ్ చేయనుంది . హానర్‌ 7S పేరుతో ఈ డివైస్‌ను ఇండియా మార్కెట్‌లో అధికారింగా లాంచ్ చేయనుంది .అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఇది వరకే చైనా లో విడుదల అయింది . దీని ధర అక్కడ CNY 599గా ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దీని ధర సుమారు 6,400 రూపాయలుతో సమానం. ఈ నేపథ్యంలో హానర్‌ 7S స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు మధ్యాహ్నం 2:00pm గంటలకు మొదలవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ ని యు ట్యూబ్,పేస్ బుక్,ట్విట్టర్ ద్వారా వీక్షించవచ్చు.

5.45 ఇంచ్ సైజ్ డిస్‌ప్లే....

5.45 ఇంచ్ సైజ్ డిస్‌ప్లే....

ఇందులో 5.45 ఇంచ్ సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఫుల్‌వ్యూ ఫీచర్‌ను ఈ డిస్‌ప్లే కలిగి ఉంది. ఫిక్సల్ రిజల్యూషన్ 1440 x 720గా ఉంది. యూజర్లకు మంచి వ్యూయింగ్ అనుభూతిని కలిగించేదుకు ఈ భారీ డిస్‌ప్లే తోడ్పడనుంది.

వెనుక భాగంలో 13  మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న  కెమెరా....

వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరా....

వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న కెమెరాను ఇచ్చారు. కాగా ఈ కెమెరా ఎల్ ఈడి ఫ్లాష్ లైటుతో వచ్చింది . దీని ద్వారా ఫోటో తీసుకున్నప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. షూట్ చేసే సమయంలో ఫోటో మీకు మరింత క్వాలిటీగా కనిపించేలా డార్క్ ని తరిమివేస్తుంది.

5 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్....

5 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్....

కాగా 5 మెగాపిక్సల్ సెల్ఫీ షూటర్ ఈ ఫోన్ కి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు సాఫ్ట్ లైట్ LED ఫ్లాష్ సదుపాయం కల్పించారు. ఈ లైట్ ద్వారా మీరు అత్యంత తక్కువ వెలుతురులో కూడా నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు.

ప్రాసెసర్,ర్యామ్,స్టోరేజ్...

ప్రాసెసర్,ర్యామ్,స్టోరేజ్...

ఈ స్మార్ట్‌ఫోన్‌కు Quad-Core Mediatek MT6739 ప్రాసెసర్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది. దీనికి తోడు 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ప్రాసెసింగ్ అలానే మల్టీటాస్కింగ్ విభాగాలను మరింత బలోపేతం చేస్తాయి.

బ్యాటరీ, సాఫ్ట్‌వేర్....

బ్యాటరీ, సాఫ్ట్‌వేర్....

హానర్‌ 7S హ్యాండ్‌సెట్‌కు 3020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 8.0 Oreo ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది.

హానర్‌ 7S ఫీచర్లు..

హానర్‌ 7S ఫీచర్లు..

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, Quad-Core Mediatek MT6739, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3020 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర...

ధర...

ఈ ఫోన్ ధర పై కంపెనీ ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దీని ధర సుమారు రూ. 6,500 వరకు ఉండవచ్చు అని అంచనా

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei's very cheap Honor 7s launches in India today.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X