త్వరలో ఇండియాకి Huawei Sonic U8650

By Super
|
Huawei Sonic U8650
ప్రపంచంలో పెద్దదైన టెలికామ్ తయారీదారు సంస్ద అయినటువంటి హావాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. హావాయి విడుదల చేసినటువంటి మొబైల్స్, స్మార్ట్ పోన్స్ ఫెర్పామెన్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అనడంలో సందేహాం లేదు. అందుకే హావాయి ప్రపంచంలో మంచి కస్టమర్‌ని సొంతం చేసుకోగలిగింది. ఇటీవల కాలంలో కస్టమర్స్‌ అభిరుచికి అనుకూలంగా మొబైల్స్ తయారు చేయాలనే ఉద్దేశ్యంతో హావాయి మార్కెట్లోకి ఓ సరిక్రొత్త మోడల్‌ని విడుదల చేయనుంది. ఈ మోడల్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఎన్ఎఫ్‌సి(Near Field Communication) ఛిప్‌తో తయారు చేయబడుతుంది.

ప్రస్తుతానికి ఈ మొబైల్ విడుదలకు సంబంధించి ఎటువంటి అఫీసియల్ కన్పర్మేషన్ లేకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన డవలప్‌మెంట్‌ విషయాలను తెలియజేయడానికి హావాయి అంగీకరించింది. హావాయి నుండి త్వరలో విడుదలయ్యేటటువంటి తక్కువ ధర గల స్మార్ట్ ఫోన్ పేరు Sonic U8650. పెద్ద పెద్ద ఫీచర్స్‌తో ఈ మొబైల్ పెద్ద పాపులర్ కాకపోయినప్పటికీ తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌లో ఉన్న అన్ని ఫీచర్స్‌ని కలిగి ఉండి ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

ఈ స్మార్ట్ ఫోన్ చూడడానికి చాలా అందంగా ఉండడం మాత్రమే కాకుండా స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌గా ఉండి మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కస్టమర్స్‌కి కలగజేస్తుంది. Huawei Sonic U8650 మల్టీ మీడియా విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాలైన ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ కస్టమర్స్‌కు మంచి సంగీతాన్ని అందిస్తుంది. వీడియో రికార్డింగా కోసం ఇందులో ఉన్న కెమెరా చాలా చక్కగా సహాయ పడుతుంది. ఐతే ఇది హై డెఫినేషన్ కెమెరా మాత్రం కాదు. ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే కమ్యూనికేషన్ టెక్నాలజీలు అయినటువంటి బ్లూటూత్, వై-పై, హై స్పీడ్ 3జి ఇంటర్నెట్ టెక్నాలజీ సౌకర్యం ఇందులో పోందుపరచబడింది. 2జి ఇంటర్నెట్ టెక్నాలజీలు అయిన GPRS, EDGEలను కూడా ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది.

The notable Huawei Sonic U8650 features:

Android Gingerbread OS
3.2 Mega Pixel camera
GPS support
3G and 2G network support
GPRS and EDGE
Bluetooth and Wi-Fi technology
Java Support
FM radio
Music and Video Player
Games
512 MB internal memory with up to 32 GB expandable memory

త్వరలో ఇండియన్ మొబైల్ మార్కెట్ లోకి రానున్న ఈ Sonic U8650 ఖరీదు కూడా రూ 17,500గా ఉండవచ్చునని నిపుణుల అంచనా.. ఈ మొబైల్ రాకతో స్మార్ట్ పోన్స్ సెగ్మెంట్‌లో కొంత మార్పుని తీసుకొని రాగలదని బావిస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X