ఆండ్రాయిడ్ ఓఎస్‌తో డ్యూయల్ సిమ్ ఫీచర్ వావ్..

Posted By: Staff

ఆండ్రాయిడ్ ఓఎస్‌తో డ్యూయల్ సిమ్ ఫీచర్ వావ్..

ఇంటర్నెట్లో ఉన్నరూమర్ ప్రకారం హువాయ్ యు8520 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుందని సమాచారం. హువాయ్ యు8520 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లైతే డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు, హెచ్‌విజిఎ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఎవరైతే యూజర్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ డ్యూయల్ సిమ్‌ని కొరుకుంటున్నారో అటువంటి వారి కొసం ప్రత్యేకంగా ఈ మొబైల్‌ని రూపోందించడం జరిగిందని హువాయ్ ప్రతినిధులు తెలియజేశారు.

హువాయ్ యు8520 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ యూజర్స్ కొసం కేవలం ఒక్క సిమ్ మాత్రమే 3జీ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇక రెండవ సిమ్ స్లాట్‌ని జిఎస్‌ఎమ్ సిమ్‌కి ఉపయోగించుకొవాల్సి ఉంటుందని తెలియజేశారు. హువాయ్ యు8520 స్మార్ట్ ఫోన్ 512 MB మొమొరీ (RAM), 2 GB ROMతో మొబైల్ మార్కెట్లో లభిస్తుంది.

ఇది మాత్రమే కాకుండా హువాయ్ యు8520 స్మార్ట్ ఫోన్‌లో ప్రత్యేకంగా యూజర్స్ కోసం 3 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. దీని సహాయంతో యూజర్స్ చక్కని ఇమేజిలను తీయవచ్చు. ఇవి మాత్రమే కాకుండా కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పైలతోపాటు, గూగుల్ మ్యాప్స్ కోసం ప్రత్యేకంగా ఇందులో జిపిఎస్ ఎరీనాని మొబైల్‌లో నిక్షిప్తం చేయడం జరిగింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డ్యూయల్ సిమ్‌కి మంచి గిరాకీ ఉండడం, ఇది మాత్రమే కాకుండా హై ఎండ్ హ్యాండ్ సెట్స్‌లలో డ్యూయల్ సిమ్ మొబైల్ లేకపోవడంతో ఈ మొబైల్‌ని రూపోందించామని తెలియజేశారు. డ్యూయల్ సిమ్ ఫోన్లకు కేవలం నార్త్ అమెరికాలోనే కాకుండా ఆసియా దేశాలైన చైనా, ఇండియా, శ్రీలంకలలో మంచి డిమాండ్ ఉండడంతో త్వరలో అక్కడ కూడా ఈ మొబైల్‌ని విడుదల చేయనున్నామని తెలిపారు.

హువాయ్ యు8520 ప్రత్యేకతలు:

ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 Operating system

ప్రాసెసర్: Qualcomm Snapdragon MSM8255 processor chip, 2GB of ROM, 512MB of Ram memory

బ్యాటరీ:1500mAh

స్క్రీన్ సైజు: 3.2 inch capacitive touch screen

డిస్ ప్లే సైజు: display having 320 x 480 image resolution

బరువు: 110 grms

వేరే ఫీచర్స్: Bluetooth, Wifi enabled, Email, Radio, Gps device Navigation, and also MP3 Playback

ధర:
ఇంకా మార్కెట్లో విడుదల చేయలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot