హువాయి, శాంసంగ్ మధ్య ముదిరిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల వార్

|

చైనా దిగ్గజం హువాయి దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీల మధ్య ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల వార్ మొదలైంది. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చందేకు హువాయి కసరత్తులు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇది నవంబర్లో మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాగా ఇప్పటికే శాంసంగ్ దీని మీద కసరత్తులు చేస్తోంది. ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ఫోన్ మా కంపెనీ నుంచే రావాలని పట్టుబట్టీ మరీ పని వేగవంతం చేసింది. అయితే దానితో పోటీగా ఇప్పుడు హువాయి కూడా మార్కెట్లోకి ఎంటరవడంతో ఏదీ ముందు వస్తుందోనని యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయటప్రతి ఒక్కరి మొబైల్లో ఈ యాప్స్ ఉన్నాయట

మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌..

మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌..

రిపోర్టుల ప్రకారం హువావే సంస్థ శాంసంగ్‌కు దీటుగా మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నదని తెలుస్తోంది. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంటుందని తెలిసింది. దీన్ని ఎల్‌జీ సంస్థ తయారు చేసి హువావేకు ఇస్తున్నదట. మరో వైపు ఇదే కంపెనీ శాంసంగ్‌కు కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లేలను సప్లయి చేస్తుందని సమాచారం.

Image source : phonesmart.pk

హువాయి టై అప్

హువాయి టై అప్

ETNews రిపోర్ట్ ప్రకారం హువాయి NDA (Non Disclosure Agreement)తో ఈ అంశం మీద సంతకం చేసినట్లు తెలుస్తోంది. పోల్డబుల్ స్మార్ట్ పోన్ల కు క్రియేటివ్ టెక్నాలజీ ని అందించడం కోసం NDA కసరత్తులు చేస్తోంది. ఈ సంస్థతో హువాయి టై అప్ అయి పోల్డుబుల్ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Image source : themobileindian.com

 LED panelsను LG Display నుంచి..
 

LED panelsను LG Display నుంచి..

Huawei Shanghai Research and Development Centre's Chief Technology Officer ఈ ప్రాజెక్టు గురించి రిపోర్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలో రానున్న ఫోన్లలో LED panelsను LG Display నుంచి తీసుకోనున్నట్లు సమాచారం.

2019లో ..

2019లో ..

కాగా LG కంపెనీ 2019లో foldable display ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు శాంసంగ్ , హువాయి కంపెనీలు ఈ displayతోనే తమ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నాయి.

ఆపిల్ కూడా..

ఆపిల్ కూడా..

కాగా ఆపిల్ కూడా ఈ రకమైన టెక్నాలజీని తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. స్మార్ట్ ఫోన్ల కోసం foldable technologyని 2020 కల్లా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. దీని కోసం LGతో ఆపిల్ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం.

ఫోల్డబుల్ ఫోన్ ని ట్యాబ్లెట్ గా..

ఫోల్డబుల్ ఫోన్ ని ట్యాబ్లెట్ గా..

హువాయి నుంచి రానున్న ఫోల్డబుల్ ఫోన్ ని ట్యాబ్లెట్ గా కూడా వాడుకునేలా తయారుచేయనున్నట్లు తెలుస్తోంది. రెండింటిని దృష్టిలో ఉంచుకుని ఫోల్డబుల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తామని దీని ద్వారా మార్కెట్లో సరికొత్త ట్రెండ్ సృష్టించబోతున్నామనే ధీమాను వ్యక్తం చేస్తోంది.

శాంసంగ్

శాంసంగ్

MWC 2018లో శాంసంగ్ సీఈఓ foldable smartphoneని తీసుకువస్తున్నామని ప్రకటించిన విదితమే. అందులో భాగంగా కొన్ని చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శించారు. ఇప్పుడు దీని సరసన  Lg, ఆపిల్, హువాయి కంపెనీలు చేరడంతో టెక్నాలజీ రంగంలో స్మార్ట్ ఫోన్ తయారీదారుల మధ్య సరికొత్త వార్ మొదలవబోతుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

 

 

ఆపిల్ అభిమానులు రెడీనా, మడిచిపెట్టుకునే ఫోన్లు వస్తున్నాయి !

ఆపిల్ అభిమానులు రెడీనా, మడిచిపెట్టుకునే ఫోన్లు వస్తున్నాయి !

వివరాలకు క్లిక్ చేయండి.వివరాలకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Huawei Working on Foldable Smartphones, Set for Launch in November: Report More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X