Huawei Y7p స్మార్ట్‌ఫోన్ ధర,ఫీచర్స్ మీద ఓ లుక్ వేసుకోండి....

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హువాయి సంస్థ థాయ్‌లాండ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌గా హువాయి Y7p ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్పోర్ట్ హోల్-పంచ్ డిస్ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అరోరా బ్లూ మరియు మిడ్‌నైట్ బ్లాక్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయబడింది. కిరిన్ 710F ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేసే హువాయి Y7p గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల వివరాలు

ధరల వివరాలు

హువాయి Y7p స్మార్ట్‌ఫోన్‌ను థాయ్‌లాండ్‌లోని కేవలం ఒకే ఒక 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ వద్ద లాంచ్ చేసింది. దీని యొక్క ధర THB 4,999 (సుమారు రూ.11,500) గా నిర్ణయించింది. ఈ ఫోన్ అరోరా బ్లూ మరియు మిడ్నైట్ బ్లాక్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. దేశంలోని లాజాడా, జెడి సెంట్రల్ మరియు షాపీ వంటి సైట్లలో ప్రీ-ఆర్డర్ల కోసం ఇది జాబితా చేయబడింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు.

 

Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే హువాయి Y7p ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత EMUI 9.1 తో రన్ అవుతుంది. ఇది 6.39-అంగుళాల HD + (720x1560 పిక్సెల్స్) TFT LCD హోల్-పంచ్ డిస్ప్లేను కలిగి ఉండి స్క్రీన్ ఎగువ ఎడమ మూలలో చిన్న కటౌట్‌తో వస్తుంది. ఈ ఫోన్ కిరిన్ 710F ఆక్టా-కోర్ SoC చేత పనిచేస్తుంది. ఇది 4GB RAM తో జత చేయబడి ఉండి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు మరింత విస్తరించడానికి అవకాశం ఇస్తుంది.

 

Samsung Galaxy 70s స్మార్ట్‌ఫోన్ ధర మీద భారీ తగ్గింపుSamsung Galaxy 70s స్మార్ట్‌ఫోన్ ధర మీద భారీ తగ్గింపు

 కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఇందులో గల కెమెరాల విషయానికి వస్తే హువాయి Y7p స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా f/ 1.8 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ సెన్సార్ తో, సెకండరీ కెమెరా f/ 2.4 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ ను మరియు మూడవ కెమెరా f / 2.4 ఎపర్చర్‌తో 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు f / 2.0 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

 

 

BSNL Bharat Fibre: 2000GB డేటా ప్రయోజనంతో కొత్త ప్లాన్BSNL Bharat Fibre: 2000GB డేటా ప్రయోజనంతో కొత్త ప్లాన్

కనెక్టివిటీ

కనెక్టివిటీ

హువాయి Y7p స్మార్ట్‌ఫోన్‌ 4,000mAh ఇంటిగ్రేటెడ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్, వై-ఫై 802.11 B/G/N, 3.5mm ఆడియో జాక్, Gps, AGPS, గ్లోనాస్ వంటివి మరిన్ని ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, దిక్సూచి మరియు గ్రావిటీ సెన్సార్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ యొక్క వెనుకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఇది 159.81x76.13x8.13mm పరిమాణంలో ఉండి 176 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Huawei Y7p Smartphone Launched: Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X