4 అదిరే కెమెరాలతో Huawei Y9,ధర కేవలం రూ. 15 వేలు మాత్రమే

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం హువాయి మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వై సిరీస్‌లో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో విడుదల చేసింది.

|

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజం హువాయి మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. వై సిరీస్‌లో భాగంగా తొలి స్మార్ట్‌ఫోన్‌ను వై 9 పేరుతో విడుదల చేసింది. బిగ్గర్‌ ఫర్‌ బెటర్‌ అనే ట్యాగు లైనుతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ముందూ, వెనక మొత్తం నాలుగు బిగ్‌ కెమెరాలతో యూజర్లు ఫోటోగ్రఫీలో మాస్టర్‌ అయిపోతారంటూ లాంచింగ్‌ సందర్బంగా కంపెనీ వ్యాఖ్యానించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే చైనాలో గత ఏడాది తీసుకొచ్చిన విషయం అందరికీ విదితమే. జనవరి 15నుంచి అమెజాన్‌ ద్వారా Huawei Y9 ప్రత్యేకంగా విక్రయానికి రానుంది. ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

 

5వ వార్షికోత్సవ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించిన షియోమి5వ వార్షికోత్సవ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించిన షియోమి

హువావే వై9 2019 ఫీచ‌ర్లు

హువావే వై9 2019 ఫీచ‌ర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 400 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

ఆకట్టుకునే ఫీచర్లు

ఆకట్టుకునే ఫీచర్లు

ఇందులో 6.5 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 13, 2 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు.ఈ ఫోన్‌లో వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉండ‌గా, 4000 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీని ఇందులో అందిస్తున్నారు.

ధర
 

ధర

రూ.15,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ప్ర‌త్యేకంగా ఈ నెల 15వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌తో రూ.2,990 విలువ గ‌ల బోట్ రాక‌ర్జ్ స్పోర్ట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

హాన‌ర్ ప్లే 8ఎ ఫీచ‌ర్లు

హాన‌ర్ ప్లే 8ఎ ఫీచ‌ర్లు

ఇదిలా ఉంటే చైనా మార్కెట్లో గత వారం హాన‌ర్ ప్లే 8ఎ ను విడుదల చేసింది. దీని ఫీచర్లను ఓ సారి చూస్తే..

హాన‌ర్ ప్లే 8ఎ ఫీచ‌ర్లు

6 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

ధర, ఇండియాకి ఎప్పుడు ?

ధర, ఇండియాకి ఎప్పుడు ?

హాన‌ర్ ప్లే 8ఎ రూ.8,115 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అక్కడ ల‌భ్యం కానుంది. ఇండియాకు ఎప్పుడు అనే దానిపై కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. కాగా ఈ ఫోన్లో 6 ఇంచుల భారీ డిస్‌ప్లే,13 మెగాపిక్స‌ల్ కెమెరా,8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,ఫేస్ అన్‌లాక్ ఫీచర్, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్,డెడికేటెడ్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ల‌ు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Huawei Y9 (2019) with dual front and rear cameras launched in India more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X