ఈ Samsung 5G ఫోన్ ధర రూ.23,999 నుంచి రూ.15,490 కి తగ్గింది ! మళ్ళీ బ్యాంకు ఆఫర్లు కూడా. 

By Maheswara
|

దీపావళి పండగ సందర్భంగా అన్ని బ్రాండ్ లు ,ఆన్లైన్ స్టోర్ లు మరియు ఆఫ్ లైన్ స్టోర్లు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ దీపావళి పండగ ఆఫర్లలో భాగంగా శామ్‌సంగ్ 5G స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ఆఫర్ తో కొనుగోలు చేయాలని భావించినట్లయితే మీకు ఇదే మంచి సమయం అవుతుంది. మధ్యతరగతి వినియోగ దారులకు అందుబాటు ధరలో Samsung నుండి Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మీకు బడ్జెట్ ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంటుంది.

 

క్రోమా ప్లాట్‌ఫారమ్‌లో

క్రోమా ప్లాట్‌ఫారమ్‌లో

అవును, ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ షోరూం అయిన క్రోమా ప్లాట్‌ఫారమ్‌లో Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ భారీ ధర తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. అసలు ధర రూ.23,999 కలిగిన ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.15,490. లకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, కస్టమర్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.2,000. తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది.

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్‌

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్‌

అంటే, బ్యాంకు కార్డు ఆఫర్ తర్వాత, వినియోగదారులు Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,490కి పొందవచ్చు. వినియోగదారులు అధికారిక క్రోమా వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా మరియు అధిక బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది.అలాగే Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర ఫీచర్లను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

డిజైన్ మరియు డిస్ప్లే నాణ్యత
 

డిజైన్ మరియు డిస్ప్లే నాణ్యత

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ 1,080 x 2400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇప్పుడు ఈ డిస్ప్లే మల్టీ టచ్ స్క్రీన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. అలాగే ఈ డిస్ప్లే 400PPI పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ ద్వారా ఇది రక్షించబడింది.

ప్రాసెసర్ వివరాలు

ప్రాసెసర్ వివరాలు

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS పై పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. 6GB RAM -128GB మరియు 8GB RAM -128GB స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లలో లభిస్తుంది.

కెమెరా వివరాలు

కెమెరా వివరాలు

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్‌లో వెనక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది,ఇందులో  ప్రధాన కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెకండరీ కెమెరా 5-మెగాపిక్సెల్ సెన్సార్ అయితే, మూడవది 2-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉన్నాయి. దీనితో పాటు, సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ సెన్సార్ తో సెల్ఫీ కెమెరా అందించబడింది.

బ్యాటరీ బ్యాకప్ వివరాలు

బ్యాటరీ బ్యాకప్ వివరాలు

Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. దీనితో పాటు, 15W కెపాసిటీ కలిగిన ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా అందించబడింది. ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 11 OS, 4G VoLTE, WiFi, బ్లూటూత్, GPS ఆడియో జాక్‌తో సహా తాజా ముఖ్యమైన ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఇంకా , Samsung Galaxy F42 5G స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ ఎంపిక, LED ఫ్లాష్ సౌకర్యాలతో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ ఆక్వా మరియు బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ గత సంవత్సరం సెప్టెంబర్ లో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ విషయాన్నీ వినియోగదారులు గ్రహించగలరు.

Best Mobiles in India

Read more about:
English summary
Huge Discount Offer Available On Samsung Galaxy F42 5G Smartphone In Croma Stores. Offer Price Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X