Home
Mobile

ఈ Vivo స్మార్ట్ ఫోన్ పై రూ.5000 ధర తగ్గింపు! ఆఫర్ ధర, సేల్ వివరాలు

By Maheswara

బిగ్ సేవింగ్ డేస్ సేల్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్, ప్రస్తుతం ఈ సేల్ లైవ్ లో ఉంది మరియు ఈ సేల్ జూలై 19 వరకు జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్ లో పలు ప్రముఖ కంపెనీల యొక్క స్మార్ట్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల పై ధర తగ్గింపును ప్రకటించింది. అలాగే, ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఈ స్పెషల్ సేల్ జూలై 19 వరకు జరగనుంది.

ఫ్లిప్కార్ట్ యొక్క ఈ ప్రత్యేక సేల్‌లో, Vivo యొక్క అద్భుతమైన 5G ఫోన్‌పై కూడా తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే Vivo T2X 5G స్మార్ట్‌ఫోన్ మోడల్‌పై ప్రస్తుతం ఈ సేల్ లో తగ్గింపు ఉంది. ముఖ్యంగా Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ గతంలో రూ.17,999 ధరకు అమ్ముడయ్యేది.

Huge Discount Offer Of 27percent On This Vivo T2X 5g Smartphone In Flipkart Sale. Offer Details Here.

అయితే, ప్రసుతం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ పై 27 శాతం తగ్గింపు ఆఫర్ అందించబడుతుంది. కాబట్టి మీరు ఈ Vivo T2X 5G స్మార్ట్‌ఫోన్‌ ను రూ.12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫోన్ పై మీరు రూ.5000 తగ్గింపు పొందుతారు. ఇంకా, ఎంచుకున్న బ్యాంకు కార్డులను ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు Vivo T2X 5G ఫోన్ ఫీచర్లను నిశితంగా పరిశీలిద్దాం.

వివో T2X స్మార్ట్‌ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 2408 ×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు మెరుగైన భద్రతా ఫీచర్లతో కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ యొక్క ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే మీకు మెరుగైన స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక ఈ ఫోన్ డిజైన్‌పై కంపెనీ మరింత శ్రద్ధతో మెరుగుదిద్దింది.

ఈ కొత్త వివో T2X స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడానికి చాలా అనువుగా ఉంటుంది. అలాగే, ఈ వివో T2X స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సౌకర్యంతో రావడం కూడా గమనించ తగిన విషయం

వివో T2X స్మార్ట్‌ఫోన్ 4GB/6GB/8GB RAM మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌లో అదనపు మెమరీ విస్తరణ కోసం SD కార్డు సపోర్ట్ ఉంది. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతును కలిగి ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ తక్కువ బరువుతో వస్తుంది.

వివో T2X స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా + 2MP బోకె కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 8MP కెమెరా కూడా ఉంది. ఇది కాకుండా, ఇది LED ఫ్లాష్ మరియు అనేక ఇతర కెమెరా ఫీచర్లను కలిగి ఉంది.

వివో T2X స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందిస్తున్నారు. కాబట్టి ఛార్జింగ్ గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫోన్ సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం, మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్, 5G, డ్యూయల్ బ్యాండ్ వై ఫై, బ్లూటూత్, GPS, USB Type C పోర్ట్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లతో ఈ Vivo ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Discount Offer Of 27percent On This Vivo T2X 5g Smartphone In Flipkart Sale. Offer Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X