Home
Mobile

ఈ శాంసంగ్ ఫోన్ పై అమెజాన్ లో రూ.5000 ధర తగ్గింది! ఆఫర్ ధర వివరాలు

By Maheswara

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్, తన గెలాక్సీ సిరీస్‌లో పలు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. వాటిలో, గెలాక్సీ M సిరీస్ ఫోన్‌లు బడ్జెట్ ధరతో అందరి దృష్టిని ఆకర్షించాయి. శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ ధర తగ్గింపు ఆఫర్ ను పొందింది. ఇది వినియోగదారులకు ఎంతో సంతోషం కలిగించే విషయం.

అవును, శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇ కామర్స్ సైట్‌లో ఆకర్షణీయమైన తగ్గింపు ధరలో కనిపించింది. ఇది 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ. 24,999 గా ఉంది. కానీ, అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ లో ధర రూ. 17,999 కి అందుబాటులో ఉంటుంది దీనితో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కొన్ని ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

Huge Discount Offer On Samsung Galaxy M33 Smartphone In Amazon Sale. Offer Price And Specifications

ఈ ఫోన్ యొక్క డిస్ప్లే డిజైన్ వివరాలు, శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD + ఇన్ఫినిటీ V డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120 Hz. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంటుంది.

ప్రాసెసర్ వివరాలు, శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ 5nm ఎక్సీనోస్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 UI 4.1 సపోర్ట్‌తో పని చేస్తుంది. ఇది 8 GB RAM మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజీ ని కూడా కలిగి ఉంది. శామ్సంగ్ యొక్క RAM ప్లస్ ఫీచర్లతో, RAM ని 16GB వరకు విస్తరించవచ్చు.

Huge Discount Offer On Samsung Galaxy M33 Smartphone In Amazon Sale. Offer Price And Specifications

కెమెరా వివరాలు, ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన ప్రధాన కెమెరా, 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో రెండవ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో మూడవ కెమెరా మరియు ఒక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో నాల్గవ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.

అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్లు బోకె ఎఫెక్ట్, సింగిల్ టేక్, ఆబ్జెక్ట్ ఎరేజర్ మరియు వీడియో TNR మరియు వీడియోగ్రఫీ మోడ్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఇందులో 8 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యం ఉన్న సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ మరియు ఇతర వివరాలు,ఈ స్మార్ట్‌ఫోన్ 6,000 mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది 25 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, బ్లూటూత్ మరియు GPS ఉన్నాయి. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ M33 5G స్మార్ట్‌ఫోన్ 6 GB RAM + 128 GB స్టోరేజ్ మరియు 8 GB + 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అమెజాన్ ఇ-కామర్స్ సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Discount Offer On Samsung Galaxy M33 Smartphone In Amazon Sale. Offer Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X