Home
Mobile

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ రోజే లాస్ట్!

By Ram Kumar

ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం కళ్లు చెదిరే డిస్కౌంట్లు డీల్స్ అందుబాటులోకి తెచ్చాయి. రిపబ్లిక్ డే 2025 సేల్‌లో భాగంగా, శామ్‌సంగ్ కంపెనీకి చెందిన బెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఈరోజే, అంటే 2025, జనవరి 19 ఈ ఆఫర్లు ముగిసిపోతున్నాయి.

ఇష్టమైన శామ్‌సంగ్ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి త్వరపడటం మంచిది. మేం మూడు బెస్ట్, వాల్యూ ఫర్ మనీ శామ్‌సంగ్ మొబైల్స్‌ని ఇక్కడ లిస్టు చేస్తున్నాం. అలాగే వాటిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో, వాటి ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

Huge Discounts on Samsung Phones

* శామ్‌సంగ్ గెలాక్సీ M35 (అమెజాన్ రిపబ్లిక్ డే సేల్)

శామ్‌సంగ్ గెలాక్సీ M35 ఫోన్ బడ్జెట్ ధరలో లభించే ఒక అద్భుతమైన స్మార్ట్‌ఫోన్. ఇది శామ్‌సంగ్ ఎక్సీనోస్ 1380 చిప్‌సెట్‌తో వస్తుంది, ఇది డైలీ టాస్కులను సింపుల్‌గా హ్యాండిల్ చేస్తుంది. దీనిలోని ముఖ్య ఫీచర్లు చూద్దాం.

డిస్‌ప్లే: 6.6-అంగుళాల ఫుల్ HD AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో స్క్రీన్‌ పగిలిపోయే అవకాశం ఉండదు.

బ్యాటరీ: 6,000mAh భారీ బ్యాటరీ, 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరాలు: వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో కెమెరా వంటి మూడు కెమెరాలు ఉన్నాయి. ఫొటోలు చాలా బాగా వస్తాయి.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1తో వస్తుంది. శామ్‌సంగ్ ఏకంగా 4 ఏళ్ల OS అప్‌డేట్లను, 5 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది. అంటే ఈ ఫోన్ దాదాపు 2030 వరకు కొత్త మొబైల్ లాగానే ఉంటుంది.

ఈ ఫోన్ బేస్ వేరియంట్ (6GB RAM + 128GB స్టోరేజ్) అమెజాన్‌లో రూ.14,999కి అందుబాటులో ఉంది. కానీ, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,499కి తీసుకోవడమే బెస్ట్.

* శామ్‌సంగ్ గెలాక్సీ S24 ప్లస్ (ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్)

గెలాక్సీ S24 ప్లస్ ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్. ఇది చాలా కాలం పాటు వాడుకోవడానికి పర్ఫెక్ట్ ఛాయిస్. దీనిలోని ముఖ్య ఫీచర్లు చూద్దాం.

ప్రాసెసర్: శక్తివంతమైన Exynos 2400 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమ్స్ ఆడినా, వీడియోలు చూసినా, ఏ పనైనా స్మూత్‌గా జరిగిపోతుంది.

డిస్‌ప్లే: 6.7-అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా స్క్రీన్ చాలా క్లారిటీగా ఉంటుంది.

కెమెరాలు: వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కెమెరా వంటి మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోటోగ్రఫీకి లవర్స్ ఇది చాలా బాగుంటుంది.

బ్యాటరీ: 4,900mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఛార్జింగ్ చాలా త్వరగా అవుతుంది.

సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI 6.1తో వస్తుంది. శామ్‌సంగ్ ఏకంగా 7 ఏళ్ల పాటు OS అప్‌డేట్లను, సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది. ఫోన్ భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటుంది.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.59,999కే లభిస్తోంది. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ రాలేదు.

* శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా: (అమెజాన్ రిపబ్లిక్ డే సేల్)

శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ రెండు ఏళ్ల క్రితం విడుదలైనా, ఇప్పటికీ ఇది ఒక పవర్‌హౌస్ లాంటిది. దీనిలోని ముఖ్య ఫీచర్లు చూద్దాం.

ప్రాసెసర్: శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. భారీ గేమ్స్, యాప్స్‌ను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

డిస్‌ప్లే: 6.8-అంగుళాల AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో స్క్రీన్ సేఫ్‌గా ఉంటుంది.

కెమెరాలు: వెనుకవైపు 200MP మెయిన్ కెమెరా, 10MP టెలిఫోటో (3x జూమ్), 10MP పెరిస్కోప్ (10x జూమ్), 12MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. కాబట్టి ఫొటోగ్రఫీ లవర్స్‌కి ఇదొక బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

బ్యాటరీ: 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

మరిన్ని ఫీచర్లు: S-పెన్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. నీటిలో పడినా, దుమ్ము పడినా ఫోన్‌కు ఏమీ కాదు.

ఈ ఫ్లాగ్‌షిప్ అమెజాన్‌లో రూ.71,999కి (12GB RAM + 256GB స్టోరేజ్) అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్లు కేవలం ఈరోజు వరకే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Discounts on Samsung Phones at Amazon and Flipkart sales 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X