Home
Mobile

ఈ మోటోరోలా 5G ఫోన్ పై ధర తగ్గింది! కొత్త ధర, స్పెసిఫికేషన్ల వివరాలు!

By Maheswara

మోటరోలా మొబైల్ గత ఏడాది భారతదేశంలో లాంచ్ చేసిన మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఈ ధర తగ్గింపు తో ఇది మరోసారి వినియోగదారులను ఆకర్షించింది.

అవును, మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.1500 తగ్గింది. అదేవిధంగా, ఈ ఫోన్ 6GB + 128GB మరియు 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది మరియు ఈ రెండు వేరియంట్‌ల ధరలు కూడా ఇప్పుడు తగ్గించబడ్డాయి.ఈ కొత్త ధర మరియు ఇతర ఆఫర్ల వివరాలు తెలుసుకుందాం.

Huge Price Cut On Moto G82 Price In Indian Market, Check New Price And Offers Details Here.

ఈ ధర తగ్గింపు తర్వాత, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999. అదే విధంగా, 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌ తో పని చేస్తుంది. కాబట్టి ఈ ఫోన్‌లోని ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోటో G82 5G డిస్‌ప్లే, డిజైన్ వివరాలు
మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ పోలరైజ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080 x 2,400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు 10 బిట్ కలర్‌కు మద్దతు ఇస్తుంది. అంటే ఇది బిలియన్ కంటే ఎక్కువ రంగులకు మద్దతు ఇస్తుంది. ఈ డిస్ప్లే 20:9 కారక నిష్పత్తిని కలిగి ఉంది.

Huge Price Cut On Moto G82 Price In Indian Market, Check New Price And Offers Details Here.

మోటో G82 5G ప్రాసెసర్ వివరాలు
మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పని చేస్తుంది. అలాగే 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా, దీని మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 1TB వరకు పెంచుకోవచ్చు.

మోటో G82 5G కెమెరా ఫీచర్ల వివరాలు
మోటో G82 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి మద్దతు ఇస్తుంది. ఇక రెండవ కెమెరా అల్ట్రా వైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు మూడవ కెమెరాలో మాక్రో లెన్స్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇందులో 16 మెగా పిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

మోటో G82 5G బ్యాటరీ మరియు ఇతర ఫీచర్ల వివరాలు
మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 30W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో ఇది 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు AI ఫేస్ అన్‌లాక్‌ను కూడా కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huge Price Cut On Moto G82 Price In Indian Market, Check New Price And Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X