ఆఫ్రికా మొబైల్ యూజర్ల కోసం త్వరలో హైడ్రోజన్ ఫోన్ ఛార్జర్లు!

Posted By:

ఆఫ్రికా మొబైల్ యూజర్ల కోసం త్వరలో హైడ్రోజన్ ఫోన్ ఛార్జర్లు!

తరచూ పవర్ కష్టాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికన్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యామ్నాయంగా త్వరలో హైడ్రోజన్ ఫోన్ పోర్టబుల్ ఛార్జర్లు అందుబాటులోకి రానున్నాయి. బ్రిటీష్ కంపెనీ ఇంటెలిజెంట్ ఎనర్జీ డిసెంబర్ చివరినాటికి 10 లక్షల హైడ్రోజన్ ఫోన్ పోర్టబుల్ ఛార్జర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఛార్జర్లను నైజీరియాలో గత నెలలుగా విజయవంతంగా పరీక్షించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ శర్మ తెలిపారు. హెడ్రోజన్ ఇంధన్ సెల్స్ లో నిండి ఉండే ఈ ఛార్జర్లు మొబైల్ ఫోన్ లను ప్రత్యామ్నాయ శక్తిని సమకూరుస్తాయి.

రానున్నరోజుల్లో మీ మొబైల్ ఫోన్ మీ శరీరం నుంచి ఛార్జ్ అవుతుంది. మీ శరీరంలో ఉన్న వేడే మీ సెల్‌ఫోన్ బ్యాటరీని పవర్‌తో నింపేస్తుంది. ఇది ఏలా సాధ్యం అనుకంటున్నారా..?. శరీరంలోని వేడితో సెల్‌ఫోన్‌లకు ఉపయోగించే బ్యాటరీలు చార్జ్ అయ్యే సాంకేతికతను అమెరికాకు చెందిన వేక్ ఫార్టెస్ట్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ అండ్ మోలిక్యూలర్ మెటీరియల్స్' శాస్రవేత్తలు సృష్టించారు. ఈ పరిశోధనలో కీలక భూమికి పోషించిన సదరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కారోల్ స్పందిస్తూ నానో టెక్నాలజీని వినియోగించడం ద్వారా శరీర వేడిని విద్యుత్ శక్తిగా మలచి బ్యాటరీ చార్జింగ్‌కు వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ‘పవర్ ఫెల్డ్'గా నామకరణం చేయబడిన ఈ సాంకేతికత సౌతభ్యతతో మొబైల్ ఫోన్ బ్యాటరీ కొద్ది క్షణాల్లోని 20శాతానికి పైగా చార్జ్ అవుతుందని నిపుణులు వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot