సీనియర్ సిటిజన్ల కోసం ‘ఐబాల్ ఆసాన్ 2’

Posted By:

ముంబై ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ సీనియర్ సిటిజన్ల కోసం ‘ఆసాన్ 2' పేరుతో సరికొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ధర రూ.2,990.

సీనియర్ సిటిజన్ల కోసం ‘ఐబాల్ ఆసాన్ 2’

ప్రధానంగా సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ఈ ఫీచర్ మొబైల్ ఫోన్ పెద్దదైన కీప్యాడ్, మెరుగైన ఆడియో, పెద్దవైన స్ర్కీన్ ఫాంట్లను కలిగి ఉంది. ఈ ఫోన్లో పొందుపరిచిన ఎస్ఓఎస్ ఫంక్షన్ అత్యవసర సమయాల్లో సహాయపడుతుంది. డిజిటల్ కెమెరా, మ్యూజిక్ ప్లేబ్యాక్ ఇంకా 8జీబి వరకు మెమరీని పెంచుకోగలిగే ఫ్లాష్ కార్డ్ సపోర్ట్‌ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

పెద్ద సైజు అంకెలతో కూడిన కీప్యాడ్‌తో పాటు మాట్లాడే కీప్యాడ్‌ ఫీచర్‌ ఇందులో ఉంటుంది. ఈ కీప్యాడ్‌ పైన నంబర్‌లను ఒత్తడంతోనే ఆ అంకె ఎంతనేది ఇంగ్లిషులో వినిపిస్తుంది. ఐదు ఎమర్జెన్సీ నంబర్‌లను సేవ్‌ చేసుకోవడానికి వీలుగా ఎస్‌ఓఎస్‌ బటన్‌ను అమర్చారు.

కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,
డ్యూయాల్ లాంగ్వేజ్ సపోర్ట్ (ఇంగ్లీష్, హిందీ),
వైర్ - ఫ్రీ ఎఫ్ఎమ్ రేడియో ఫీచర్,
ఎల్ఈడి టార్చ్,
ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్,
ఫోన్ లాక్,
మాట్లాడే కీప్యాడ్,
డిజిటల్ కెమెరా,
మ్యూజిక్ ప్లేబ్యాక్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot