యువతే టార్గెట్!!

Posted By: Staff

యువతే టార్గెట్!!

 

యువతే ప్రధానంగా, ఐబాల్ సంస్థ డిజైన్ చేసిన డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ‘ఐబాల్ ఔరా3’ యువ హృదయాలను కొల్లగొట్టేందుకు రాబోతుంది. ఈ స్లీక్ డిజైన్ హ్యాండ్‌సెట్ అందమైన రూపాన్ని కలిగి చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

డ్యూయల్ సిమ్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్,

జావా ఆపరేటింగ్ సిస్టం,

1200mAh బ్యాటరీ,

3.5’’టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

ఎఫ్ఎమ్ రేడియో,

యూఎస్బీ వీ2.0 కనెక్టువిటీ,

16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

4జీబి మైక్రోఎస్డీ కార్డ్.

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యూయల్ సిమ్‌స్లాట్ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తుంది. ఏక కాలంలో రెండు నెంబర్లను ఈ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన టచ్‌స్ర్కీన్ వ్యవస్థ సౌకర్యవంతంగా స్పందిస్తుంది. క్లారిటీతో కూడిన డిస్‌ప్లే స్ర్ర్కీన్ మన్నికైన విజువల్ అనుభూతిని కలిగిస్త్తుంది.

హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేసిన ఉత్తమ క్వాలిటీ ఆడియో, వీడియో ప్లేయర్ వ్యవస్థలు మన్నికైన వినోదాన్ని చేరువచేస్తాయి. ఎఫ్ఎమ్ రేడియో ఫెసిలిటీ అదనం. యూఎస్బీ కనెక్టువిటీ ఆధారంగా ఎక్సటర్నల్ స్టోరేజ్‌ను వినియోగించుకోవచ్చు. పొందుపరిచిన స్టాండర్డ్ బ్యాటరీ వ్యవస్ధ సుదీర్ఘ బ్యాకప్‌నిస్తుంది. ఇంగ్లీష్, హిందీ భాషలను ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్లాక్-రెడ్, బ్లాక్-సిల్వర్ కలర్ వేరియంట్‌లలో ఐబాల్ ఔరా 3 లభ్యం కానుంది. ధర అంచనా రూ.4,500.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting