ఐబాల్ ఆండీ 4.5పీ గ్లిట్టర్@ధర రూ.7,399
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ తన ఆండీ సిరీస్ నుంచి 4.5పీ గ్లిట్టర్ పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.7,399. డ్యుయల్ సిమ్, 3జీ కనెక్టువిటీ, పెద్దదైన తాకేతెర, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ కెమెరా, ఆటో కాల్ రికార్డింగ్ వంటి విశిష్టమైన ఫీచర్లను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

ఐబాల్ ఆండీ 4.5పీ గ్లిట్టర్ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల టచ్ స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 854పిక్సల్స్),
1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ ప్రత్యేకతతో),
వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో,
512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, ఏ2డీపీ, జీపీఎస్ కనెక్టువిటీ,
1450ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications