ఐబాల్ నుంచి సరికొత్త డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ దేశవాళీ మొబైల్ తయారీ బ్రాండ్ ఐబాల్ డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ పేరు ‘ఐబాల్ ఆండీ 4డీఐ+'(iBallAndi 4Di+). ధర రూ.6,399. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ముందు వర్షన్ అయిన ‘ఆండీ 4డీఐ' ఫోన్‌ను ఐబాల్ గడిచిన జూలైలో విడుదల చేసింది.

ఐబాల్ ఆండీ 4డీఐ+ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. హ్యాండ్‌సెట్ 4 అంగుళాల ఐపీఎస్ WVGA డిస్‌ప్లే వ్యవస్థను కలిగి ఉంటుంది. 1.3గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.
512ఎంబి ర్యామ్ వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌కు అనుమతిస్తుంది. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్.
కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, వై-ఫై, 2జీ (ఎడ్జ్), 3జీ, ఎఫ్ఎమ్ రేడియో, ఏ-జీపీఎస్, బ్లాక్ కలర్ వేరియంట్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








