ఐబాల్ నుంచి రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు
దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ ‘ఆండీ 5 -ఇ7', ‘ఆండీ 5-ఎమ్8' వేరియంట్‌లలో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ఈ ఫోన్‌ల ధరలను రూ.8,199, రూ.8,999గా పేర్కొంది. మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఐబాల్ ఆండీ 5-ఇ7 కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, ధర రూ.8,199.
(కనెక్టువిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ)
ఐబాల్ ఆండీ 5-ఎమ్8 కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 3జీ కనెక్టువిటీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5 అంగుళాల డిస్‌ప్లే(రిసల్యూషన్480x 854పిక్సల్స్), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1850ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,999.
(కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, ఎడ్జ్, జీపీఆర్ఎస్)
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








