కరీనా కపూర్‌కే పోటీనా..?

Posted By: Prashanth

కరీనా కపూర్‌కే పోటీనా..?

 

ఇండియా ఆధారిత మొబైల్ తయారీ సంస్థ ఐబాల్ ఇప్పటికే అనేక వేరియంట్‌లలో మొబైల్ ఫోన్‌లను దేశీయ విపణిలో విడుదల చేసింది. బాలివుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ను ప్రచారకర్తగా ఎంచుకున్నఈ సంస్థ రెట్టించిన ఉత్సాహాంతో మార్కెట్లో సరికొత్త ఆండ్రాయిడ్ ఐసీఎస్ మొబైల్ ఫోన్‌లను విడుదల చేయునుంది. తాజాగా ఈ బ్రాండ్ నుంచి రూపుదిద్దుకన్న ‘ఐబాల్ ఆండీ 5సీ’...వికిడ్‌లీక్, స్పైస్, మైక్రోమ్యాక్స్‌ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొవల్సి ఉంది.

ఐబాల్ ఆండీ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఇన్‌బుల్ట్ ఫ్టాష్),

1గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

ప్రాక్సిమిటీ సెన్సార్, జీ-సెన్సార్, లైట్ సెన్సార్,

హెచ్ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డీపీఏ 7.2ఎంబీపీఎస్,

3జీ కనెక్టువిటీ,

2,300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ధరను రూ.15,999.

ఐబాల్ ఆండీకి పోటీగా భావిస్తున్నవికిడ్ లీక్ వామ్మీ నోట్ ఫాబ్లెట్ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్చ

డిస్ ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెర్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,

2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్ బై 260 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు),

ధర రూ. 11,000.

వామ్మీ నోట్ ఫాబ్లెట్, ఆగస్టు 30 నుంచి వికెడ్ లీక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot