రూ.1500లో అదరగొట్టే డ్యూయల్ సిమ్ ఫోన్!

Posted By: Super

రూ.1500లో అదరగొట్టే డ్యూయల్ సిమ్ ఫోన్!

 

ముంబై ఆధారిత టెక్నాలజీ కంపెనీ ఐబాల్ (iBall) పటిష్టమైన ఫీచర్లతో తక్కువ ధర డ్యూయల్ సిమ్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ‘ఫాబ్ 22ఇ’ మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ ఎంట్రీ లెవల్ హ్యాండ్‌సెట్ ధర రూ.1,499. వేగవంతమైన ప్రాసెసర్, అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఒదిగి ఉన్నాయి.

కీలక స్పెసిఫికేషన్‌లు.......

డిస్‌ప్లే: 2.4 అంగుళాల స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

ప్రాసెసర్: 312మెగాహెడ్జ్ ప్రాసెసర్,

కెమెరా: 1.3మెగా పిక్సల్ రేర్ కెమెరా,

మెమరీ స్టోరేజ్: ఇంటర్నల్ మెమరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 8జీబికి పొడిగించుకోవచ్చు.

బ్యాటరీ: 2,200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 8.5 నుంచి 9 గంటలు),

ప్రత్యేక ఫీచర్లు: వైర్‌ఫ్రీ ఎఫ్ఎమ్, మొబైల్ ట్రాకర్, బుల్ట్‌ఇన్ ఎల్ఈడి టార్చ్, ఇంగ్లీష్ ఇంకా హిందీ లాంగ్వేజ్ సపోర్ట్,

ధర ఇతర వివరాలు: ధర రూ.1,499. మరిన్న ఫోన్‌లకు సంబంధించి ధరలు, స్పెసిఫికేషన్‌ల కోసం goProbo.comలోకి లాగిన్ కాగలరు. మా లింక్ అడ్రస్ http://www.goprobo.com/

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot