త్వరలో ఐబాల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్

Posted By: Staff

త్వరలో ఐబాల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్

ఐబాల్ మొన్న మార్కెట్లోకి టాబ్లెట్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. రబోయే కాలంలో ఐబాల్ మొబైల్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టనుందని సమాచారం. ఇందులో భాగంగానే మొబైల్ మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఫోన్స్ విభాగంలో ఓ మొబైల్‌ని, దీనితో పాటు ఎక్కువ కాలం బ్యాటరీని అందించే మొబైల్‌ని విడుదల చేయనుంది. ఐబాల్ నుండి ఒక మోడల్‌ని విడుదల చేశామంటే చాలు యూజర్స్ మరిన్ని మొబైల్స్‌ని మా వద్ద నుండి ఆశించడం జరుగుతుందని కంపెనీ ప్రతినిధిలు టాబ్లెట్‌ను విడుదల చేసే టైంలో వెల్లడించారు.

ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మైక్రోమ్యాక్స్ ఏ70 మాదిరి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్ కస్టమర్స్ ఆండ్రాయిడ్ మొబైల్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న తరుణంలో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే స్పైస్ కంపెనీ స్పైస్ ఎమ్ఐ310 పేరుతో ఆండ్రాయిడ్ మొబైల్ పోన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ మొబైల్ పోన్ ధర సుమారుగా రూ 6000 నుండి రూ 7000 మద్యలో ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

2.2 ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్‌తో పాటు యూజర్స్‌ చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.3 ఇంచ్‌గా స్క్రీన్ సైడు డిస్ ప్లేని రూపోందించడం జరిగింది. ఐబాల్ విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సుమారుగా 20గంటలు పాటు టాక్ టైమ్‌ని అందించనున్నాయని సమాచారం. ఇక నెట్ వర్క్ విషయానికి వస్తే 2జీ, 3జీ రెండు నెట్ వర్క్ లను సపోర్ట్ చేయనున్నాయి. ఇప్పటికే ఐబాల్ కంప్యూటర్స్ ఉత్పత్తులను విడుదల చేయడంలో దేశంలోనే నెంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot