ఐబాల్ నుంచి ప్రారంభస్థాయి స్మార్ట్‌ఫోన్‌లు
ఇండియన్ మార్కెట్లో అంచెలంచెలుగా విస్తరిస్తున్న ప్రముఖ దేశవాళీ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ ఐబాల్ రెండు ఎంట్రీస్థాయి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఐబాల్ ఆండీ 3.5కేకేఇ 3జీ జీనియస్ ( Andi 3.5kke 3G Genius), ఆండీ 2జీ విన్నర్ (Andi 2G Winner) మోడల్స్‌లో రూపకల్పన చేయబడిన ఈ ఆరంభస్థాయి స్మార్ట్ డివైస్‌ల ధరలను ఐబాల్ రూ.3,999, రూ.3,499 గా నిర్థారించింది.

ఈ స్మార్ట్ మొబైల్‌ఫోన్‌లకు సంబంధించిన ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. ఆండీ 3.5కేకేఇ 3జీ జీనియస్ మోడల్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. మరో మోడల్ ఆండీ 2జీ విన్నర్ 2జీ కనెక్టువిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. తక్కిన ఫీచర్లన్ని ఈ రెండు ఫోన్‌లలో సమానంగా ఉంటాయి. ఈ ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
3.5 అంగుళాల HVGA డిస్‌ప్లే,
డ్యూయల్ కోర్ 1.3గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),
3జీ ఇంకా 2జీ కనెక్టువిటీ,
జీపీఎస్ మరియు ఏ-జీపీఎస్,
1250ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








