రెండు అస్త్రాలు.. ఐదుగరు ప్రత్యర్థులు!

Posted By: Prashanth

రెండు అస్త్రాలు.. ఐదుగరు ప్రత్యర్థులు!

 

దేశీయ బ్రాండ్ ఐబాల్ తన ఆండీ సిరీస్ నుంచి ‘3ఇ’, ‘4డి’ మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. వీటి ధరలను రూ.6,990, రూ.9490గా బ్రాండ్ ప్రకటించింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో మొదటిదైన ‘ఆండీ 3ఇ’ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 3.2 అంగుళాల సమర్థవంతమైన టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, విజువల్స్‌ను ఉత్తమ క్వాలిటీతో విడుదల చేస్తుంది. స్ర్కీన్ కింద భాగంలో ఏర్పాటు చేసిన 4 టచ్ బటన్లు సౌకర్యవంతంగా స్పందిస్తాయి.

బటన్ల కింద భాగంలో ఏర్పాటు చేసిన బ్లింకింగ్ లైట్ బార్ కొత్త తరహా అనుభూతులుకు లోను చేస్తుంది. డ్యూయల్ సిమ్ సౌలభ్యతతో రెండు నెట్‌వర్క్‌లను ఏకకాలంలో ఉపయోగించుకోవచ్చు. మరో ఫోన్ ‘ఆండీ 4ఇ’ 4 అంగుళాల టచ్‌స్ర్కీన్‌ను కలిగి ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. రూ.10,000 దిగువ ధరకు మార్కెట్లో లభ్యమవుతున్న మైక్రోమ్యాక్స్, సామ్‌సంగ్, లావా, స్పైస్, ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌లకు ఐబెర్రీ ఫోన్‌లు పోటీగా నిలవనున్నాయి.

మైక్రోమ్యాక్స్ ఎక్స్445:

దేశీయ మొబైల్ తయారీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యూయల్ సిమ్ ఫోన్‌‍ను మార్కెట్‌కు పరిచయం చేసింది. పేరు మైక్రోమ్యాక్స్ ఎక్స్445. దిగువ, మధ్య తరగతి మొబైల్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని రూపొందించబడిన ఈ హ్యాండ్‌సెట్ నిక్కార్సైన పనితీరును ప్రదర్శిస్తుంది. డివైజ్‌లో పొందుపరిచిన డ్యూయల్ సిమ్ టెక్నాలజీ యూజర్‌కు రెండు నెట్‌వర్క్‌ల కమ్యూనికేషన్‌ను ఏకకాలంలో అందిస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్లను పరిశీలిస్తే ఏర్పాటు చేసిన 3.2 అంగుళాల టచ్‌ స్ర్కీన్ డిస్‌ప్లే ఉత్తమమైన విజువల్ అనుభూతులను అందిస్తుంది. వెనుక భాగంలో నిక్షిప్తం చేసిన 0.3 మెగాపిక్సల్ కెమెరా ఫోటోగ్రఫీ అవసరాలను తీరుస్తుంది.

ఇంటర్నల్ మెమరీ 128ఎంబీ, మైక్రోఎస్‌డీ కార్డ్ సపోర్ట్‌తో మొబైల్ మెమరీని 8జీబి వరకు పెంచుకోవచ్చు. ఏర్పాటు చేసిన మల్టీ ఫార్మాట్ ఆడియో, వీడియో వ్యవస్థలు ఉత్తమ క్వాలిటీ వినోదాన్ని చేరువచేస్తాయి. పొందుపరిచిన ఎఫ్ఎమ్ రేడియో తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరువచేస్తుంది. కనెక్టువిటీ అంశాలను పరిగణలోకి తీసుకంటే ఏర్పాటు చేసిన బ్లూటూత్ (వీ3.0), యూఎస్బీ (వీ2.0) ఫీచర్లను మొబైల్ డేటాను వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. అమర్చిన 1000ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ 4 గంటల టాక్‌టైమ్, 129 స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ధర అంచనా రూ.3,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot