ఐబాల్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు
ప్రముఖ దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కపెనీ ఐబాల్ అందుబాటు ధరల్లో రెండు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఆండీ4 ఐపీఎస్ జెమ్', ‘ఆండీ4 ఐపీఎస్ వెల్వట్' వేరియంట్‌లలో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఐబాల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో లభ్యమవుతున్నాయి. త్వరలోనే వీటిని ప్రముఖ రిటైలర్ల వద్ద విక్రయించనున్నారు. మార్కెట్లో ఐబాల్ ఆండీ4 ఐపీఎస్ జెమ్ ధర రూ.5,699. మరో ఫోన్ ఆండీ4 ఐపీఎస్ వెల్వట్ ధర రూ.5,199. ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే........

ఐబాల్ ఆండీ4 ఐపీఎస్ జెమ్ కీలక స్పెసిఫికేషన్‌లు:
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.
ఐబాల్ ఆండీ4 ఐపీఎస్ వెల్వట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
ఆండ్రాయిడ్ 4.2 ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 256ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1300ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 2జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్, ఆటో కాల్ రికార్డింగ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.
బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అనుభూతులను ఆస్వాదించాలనుకునే వారికి ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








