‘సోనీ‌ ఎక్స్‌పీరియా ప్లే’ ఐసీఎస్ అప్‌డేట్!!!

Posted By: Super

 ‘సోనీ‌ ఎక్స్‌పీరియా ప్లే’ ఐసీఎస్ అప్‌డేట్!!!

 

యూజర్ ఫ్రెండ్టీ కమ్యూనికేషన్ ఫీచర్లతో గుగూల్ ఆండ్రాయిడ్ ప్రవేశపెట్టిన సరికొత్త వోస్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టంకు మంచి స్పందన లభిస్తోంది. అనేక బ్రాండ్‌లు ఈ వోఎస్ అప్‌డేట్ పై మక్కువ చూపుతున్నాయి. మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక

క్రేజ్‌ను సంపాదించుకున్న ‘సోనీ ఎరిక్సన్’ తాజాగా ఈ అప్‌డేట్ పై కన్నేసింది. ఈ బ్రాండ్ నుంచి టాప్ క్వాలిటీ లక్షణాలతో విడుదలైన ‘సోని ఎరిక్సిన్ ఎక్స్‌పీరియా ప్లే’లో ఐసీఎస్ వోఎస్ అప్‌డేట్‌కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ చివరినాటికి ఈ అప్‌డేట్ వర్తిస్తుంది.

అన్ని రోజులు ఓపిక పట్టలేని వారి కోసం ఐసీఎస్ ఆధారిత రోమ్‌ను సోనీ సంబంధిత సైట్‌లోఉంచారు. ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ 4.0.3 వర్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ రోమ్ ఒరిజనల్ ఐసీఎస్ లక్షణాలను ఒదిగి ఉంటుంది. టెస్టింగ్ ఫేస్‌లో ఉన్న ఈ అప్లికేషన్ లో కొన్ని స్టాండర్డ్ ఫోన్ ఫీచర్లు పనిచేయవు. కెమెరా, టచ్ ప్యాడ్, వై-ఫై హాట్ స్పాట్ వంటి అంశాల నిర్వహణ ఇబ్బందిగా ఉంటుంది. ఈ అప్‌డేట్‌ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకున్న వారు ఏప్రిల్ చివరి వరకు ఆగాల్సిందే. ఐస్‌క్రీమ్ వోఎస్‌ను పరిచయం చేసుకునేందుకుగాను ‘రోమ్’ను అప్‌డేట్ చేసుకునే వారు ముందుగా తమ ఫోన్ లోని డేటాను తప్పనిసరిగా బ్యాకప్ చేసుకోవల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot