ఐడియా vs స్పైస్.. ఎవరికి ఓటేస్తారు?

Posted By: Staff

ఐడియా vs స్పైస్.. ఎవరికి ఓటేస్తారు?

 

దేశీయ టెక్ మార్కెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో కళకళలాడుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలు తమతమ ప్రత్యేకతలను జోడించి వివిధ శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, ప్రముఖ టెలికం ఆపరేటర్ ఐడియా ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే సరికొత్త 3జీ స్మార్ట్‌ఫోన్ ‘ఆరుస్’ను ఆవిష్కరించింది. మరో వైపు స్పైస్ తన ఆండ్రాయిడ్ ఫోన్‌ల జాబితాను మరింత పటిష్టం చేసే దిశగా సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్ ‘ఎమ్ఐ-320’ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఆకట్టకునే స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్ సెట్‌ల ఫీచర్ల పై విశ్లేషణ.......

బరువు ఇంకా చుట్టుకొలత:

ఐడియా ఆరుస్: శరీర కొలత 61.84 x 116 x 12.15మిల్లీమీటర్లు, బరువు 136 గ్రాములు,

ఎమ్ఐ-320: శరీర కొలత 111 x 59.6 x 12.8మిల్లీమీటర్లు, బరువు 120 గ్రాములు,

డిస్‌ప్లే:

ఐడియా ఆరుస్: 3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్),

ఎమ్ఐ-320: 3.2 అంగుళాల టీఎఫ్‌టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్),

ప్రాసెసర్:

ఐడియా ఆరుస్: 800మెగాహెడ్జ్ మీడియాటెక్ ఎమ్‌టి6573 ప్రాసెసర్,

ఎమ్ఐ-320: 650మెగాహెడ్జ్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

ఐడియా ఆరుస్: ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

ఎమ్ఐ-320: ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

ఐడియా ఆరుస్: 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

ఎమ్ఐ-320: 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

ఐడియా ఆరుస్: 256 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఎమ్ఐ-320: 256 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఐడియా ఆరుస్: వై-ఫై 802.11 a/g/b/n, బ్లూటూత్,

ఎమ్ఐ-320: వై-ఫై 802.11 a/g/b/n, బ్లూటూత్,

బ్యాటరీ:

ఐడియా ఆరుస్: 1300ఎమ్ఏహెఎచ్ లియోన్ బ్యాటరీ,

ఎమ్ఐ-320: 1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర:

ఐడియా ఆరుస్: ధర రూ.7,190,

ఎమ్ఐ-320: 4899.

తీర్పు:

ఈ తక్కువ ధర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ ఇంకా సాఫ్ట్‌వేర్‌లను ఒదిగి ఉన్నాయి. ఐడియా ఆరుస్‌లో నిక్షిప్తం చేసిన ఐడియా అప్లికేషన్ మెయిల్(అప్లికేషన్ స్టోర్), ఆండ్రాయిడ్ మేనేజర్, కరన్సీ కన్వర్టర్, ఫోటో ఎడిటర్, పిన్‌బాల్ గేమ్, రింగ్‌డ్రాయిడ్, షాజమ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను యూజర్‌కు మరింత ఉపయోగపడతాయి. మరో వైపు ఎమ్ఐ-320లో ఇన్-బుల్ట్ చేసిన నెట్‌క్విన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్, వాల్ట్ ప్రైవసీ, ఏ-జీపీఎస్, తదితర సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లు వినియోగదారుకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరువ చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ అదేవిధంగా ఉత్తమ కెమెరా వ్యవస్థను కోరుకునే వారికి ఐడియా ఆరుస్ ఉత్తమ ఎంపిక. అంత ధర వెచ్చించలేని వారికి స్పైస్ ఎమ్ఐ-320 బెస్ట్ ఛాయిస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot