'ఐడియా బ్లేడ్' మీ మొబైల్‌ని మార్చేస్తుంది..

భారత సెల్యులర్ నెట్ వర్కింగ్ సర్వీస్‌ని అందించే ఐడియా మొబైల్ మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది. ఐడియా విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పేరు 'ఐడియా బ్లేడ్'. ఆండ్రాయిడ్ 2.2 ప్రోయో ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి ఈ స్మార్ట్ ఫోన్‌లో 600MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. అభిమానులకు ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి. ఐడియా బ్లేడ్ మొబైల్‌ని సొంతంగా రూపొందించి విడుదల చేయడం లేదు.
దేశీయ మొబైల్ దిగ్గజం జడ్‌టిఈ బ్లేడ్ మొబైల్‌నే ఐడియా బ్లేడ్‌గా విడుదల చేస్తున్న విషయాన్ని గమనించగలరు. ఐడియా బ్లేడ్ ప్రత్యేకతలు విషయానికి వస్తే 3.5 ఇంచ్ టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండి, స్క్రీన్ రిజల్యూషన్ 480x800 ఫిక్సల్‌గా ఉంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.2 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయడమే కాకుండా, చక్కని వీడియోని కూడా తీయవచ్చు.
మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 150MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి మెమరీ కార్డు ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. మార్కెట్లో లభించే అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు గాను ముందు గానే ఇందులో ప్రీ అప్లికేషన్స్‌ని నిక్షిప్తం చేశారు. ఐడియా బ్లేడ్ మొబైల్‌ని ఎవరైతే కస్టమర్స్ కొనుగోలు చేస్తారో వారి కొసం ప్రత్యేకంగా ఐడియా ఫ్రీ డేటా సర్వీస్‌లను అందిస్తుంది.
ఐడియా బ్లేడ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు:
చుట్టుకొలతలు: 116 x 56.5 x 11.8 mm
నెట్ వర్క్: 3G
ఆపరేటింగ్ సిస్టమ్: Android 2.2 OS
ప్రాసెసర్: 600MHz Processor
డిస్ ప్లే సైజు: 3.5-inch Touchscreen Display
డిస్ ప్లే రిజల్యూషన్: 480 x 800 pixels screen resolution
ఇంటర్నల్ మెమరీ: 150MB Internal storage
విస్తరించుకునే మెమరీ: up to 32GB external memory support
కెమెరా: 3MP Camera
వీడియో రికార్డింగ్: Video recording & playback
మ్యూజిక్ ప్లేయర్స్: Multi Format Music Player
ఆడియో జాక్: 3.5 mm jack
కనెక్టివిటీ: USB, Wi-Fi, Bluetooth data conectivity
సోషల్ నెట్ వర్కింగ్: Social Networking Integration
మెసేజింగ్: IM and Email Support
అదనపు ప్రత్యేకతలు: Pre-instaled Software and Applications
బ్యాటరీ: Standard
బరువు: 130G


Click it and Unblock the Notifications