ఇడియా ఆఫర్: జీరో బ్యాలెన్సా అయినా కాల్ చేసుకోవచ్చు!!

Posted By: Super

 ఇడియా ఆఫర్: జీరో బ్యాలెన్సా అయినా కాల్ చేసుకోవచ్చు!!

 

మీ ఫోన్ బ్యాలెన్స్ సున్నాకు చేరుకుందా, అయినా మీ సమాచారాన్ని అవతలి వ్యక్తికి చేరవెయ్యచ్చు. ఈ సౌలభ్యతను ఐడియా నెట్‌వర్క్ కల్పిస్తుంది. ‘ఐడియా లైఫ్‌లైన్’ పేరుతో  ప్రత్యేక క్రెడిట్ సర్వీస్‌ను ఇడియా సెల్యులర్ నెట్‌వర్క్ ప్రారంభించనుంది. ఈ సర్వీస్ వినియోగించుకునేవారు ముందుగా 90 రోజులు పైబడిన ఐడియా కస్టమరై ఉండాలి. ఆకౌంట్ బ్యాలెన్స్ సున్నాకు చేరుకున్నప్పుడు సంబంధిత ఫోన్ నుంచి  53567(టోల్ ఫ్రీ) నెంబర్‌కు డయల్ చేసి మూడు రూపాయిల టాక్‌టైమ్‌ను అప్పటికప్పుడు పొందవచ్చు. తరువాత చేయించుకునే రిఛార్జ్ బ్యాలెన్స్‌లో ఈ మొత్తం మినహాయించబడుతుంది. అత్యవసర సందర్భాల్లో ఈ సర్వీస్ మరింత ఉపయోగపడుతుంది. తొలత ఈ ఐడియా లైఫ్‌లైన్ పధకాన్ని గోవా, మహారాష్ట్రా ప్రాంతాల్లో అమలు చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot