ఐడియా సెల్యులార్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికామ్ ఆపరేటర్ ‘ఐడియా సెల్యులార్'(Idea Cellular) రెండు సరికొత్త 3జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ‘Ultra II', ‘Id 1000' మోడల్స్‌లో విడుదలైన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లు 3జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఆకర్షించే అవకాశం ఉంది. 

ఐడియా సెల్యులార్ నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఐడియా సెల్యులార్ అల్ట్రా II ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే...... 5.5 అంగుళాల స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2,500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.12,500.

ఐడియా ఐడీ 1000 ప్రధాన ఫీచర్లను పరిశీలించినట్లయితే.... 3.5 అంగుళాల స్ర్కీన్, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, మార్కెట్లో ఈ ప్రారంభ స్థాయి ఫోన్ ధర రూ.5,400.

ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్రా, గోవా, మధ్యప్రదేశ్, చత్తిస్ గఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వెస్ట్, ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతాల్లో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయని ఐడియా సెల్యులార్ పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot