ఐడియా స్మార్ట్ ఫోన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది..

Posted By: Staff

ఐడియా స్మార్ట్ ఫోన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది..

 

భారతదేశంలో ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్ యూజర్స్ బాగా పెరగిపోతుండడంతో రొజుకో కొత్త మొబైల్ కంపెనీ పుట్టుకొస్తుంది. ఈ కొవలోకి కొత్తగా భారతదేశం గర్వించతగ్గ సెల్యులర్ నెట్ వర్క్ 'ఐడియా సెల్యులర్' ఆండ్రాయిడ్ మార్కెట్లోకి అడుగు పెట్టనుంది. అంతేకాదండొయ్ భారత మొబైల్ మార్కెట్లోకి కొత్త ఐడియా సెల్యులర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయనుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కపానియా వెల్లడించారు.

ఐడియా సెల్యులర్ కంపెనీ కొత్తగా మార్కెట్లోకి ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేయడం వెనుక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ ఉన్నట్లు తెలపారు. ఆ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే ఐడియా సెల్యులర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి 3జీ సర్వీస్‌లను పాపులర్ చేసేందుకేనని మార్కెట్ వర్గాల భోగట్టా. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హై ఎండ్ మొబైల్ పోన్స్‌కి ఏ మాత్రం తీసిపోని విధంగా తమ ఉత్పత్తులను విడుదల చేయనున్నామని తెలిపారు.

ఐడియా సెల్యులర్ విడుదల చేయనున్న స్మార్ట్ ఫోన్స్ జిఎస్ఎమ్, సిడిఎమ్ రెండు నెట్ వర్క్‌లను సపొర్ట్ చేయనున్నాయి. ఐడియా సెల్యులర్ కంపెనీ భారతదేశం మొత్తం మీద 11 సర్కిల్స్‌లలో 3జీ సేవలను పొందడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, జమ్ము & కాశ్మీర్ మొదలగునవి. ప్రస్తుతానికి 3జీ సేవలను యూజర్స్‌కు మరింతగా చేరువయ్యేందుకు గాను ఐడియా సెల్యులర్ స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేయనుందని సమాచారం. ఐతే వీటికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వన్ ఇండియా పాఠకులకు అందజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot