మార్కెట్లోకి ఐడియా 3జీ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ మొబైల్ ఆపరేటర్ ఐడియా గురువారం సరికొత్త 3జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఐడీ 4000 3జీ మోడల్‌లో విడుదలైన ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ధర రూ.4,999. దేశవ్యాప్తంగా 11 సర్కిళ్లలో ఉన్న ఐడియా 3జీ మార్కెట్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. దేశంలోనే మూడవ అతిపెద్ద టెలికామ్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన ఐడియా ఇప్పటికే విడుదల చేసిన పాత మోడల్ 3జీ స్మార్ట్‌ఫోన్‌లను సంబంధించి 7 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. 21.1 ఎంబీపీఎస్ వేగంతో డేటాను అందకునే వీలున్న ఐడీ 400 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే....

మార్కెట్లోకి ఐడియా 3జీ స్మార్ట్‌ఫోన్

4 అంగుళాల HVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 320x480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
512ఎంబి ర్యామ్,
512ఎంబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ).

ఐడీ 4000 3జీ స్మార్ట్‌ఫోన్ లభ్యమయ్యే సర్కిళ్ల వివరాలు.... ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ , కేరళ, మాహారాష్ట్రా, గోవా, మధ్యప్రదేశ్, చత్తిస్‌గఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ (తూర్పు), ఉత్తరప్రదేశ్ (పశ్చిమ).


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot