ఐడియా సరికొత్త 2జీ మొబైల్ ఇంటర్నెట్ ప్రీపెయిడ్ ప్లాన్

Posted By:

ఐడియా సరికొత్త 2జీ మొబైల్ ఇంటర్నెట్ ప్రీపెయిడ్ ప్లాన్

భారతదేశంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ అయిన ఐడియా సెల్యూలర్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 2జీ డేటా స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ చవక ధర డేటా ప్లాన్ విలువ రూ.25. ఈ స్పెషల్ ఇంటర్నెట్ ట్రెయిల్ ప్యాక్ ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారులకు తక్కువ బడ్జెట్‌లో 2జీ అనుభూతులను చేరువ చేస్తుంది.

ఈ స్కీమ్‌ను పొందాలనుకునే ఐడియా ప్రీపెయిడ్ వినియోగదారు తన మొబైల్ హ్యాండ్ సెట్ నుంచి *150*222#కు డయల్ చేయటం ద్వారా 500 ఎంబీ 2జీ డేటాను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 7 రోజులు. ఈ ప్యాక్‌ను వినియోగదారు ఒక్కసారి మాత్రమే పొందేందుకు వీలుంటుంది.

స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

తమ వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకునే క్రమంలో దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లు తమ 2జీ డేటా, వాయిస్ కాల్ రేట్ ఇంకా 3జీ డేటాలకు సంబంధించి వివిధ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. గత నెలలో.. రిలయన్స్ తగ్గింపు 3జీ డేటా ధరలతో ఆకట్టుకోగా డొకోమో అన్ లిమిటెడ్ ఇంకా ఉచిత రోమింగ్ ప్లాన్ (రూ.1,299) ను ప్రవేశపెట్టింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot