ఐడియా డేటా ఛార్జీలు 90% వరకు తగ్గింపు!

Posted By:

ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఐడియా తమ డేటా వినియోగాన్ని మరింతంగా పెంచేందుకు 2జీ ఇంకా 3జీ టేటా ఛార్జీలను గణనీయంగా తగ్గించినట్లు ఐడియా సెల్యూలర్ పీటీఐతో పేర్కొంది. దేశవ్యాప్తంగా 2జీ డేటా ఛార్జీల పై 90శాతం, 3జీ డేటా ఛార్జీల పై 33 శాతం వరకు ధరలను తగ్గిస్తున్నట్లు సదరు ఆపరేటర్ తెలిపింది.

ఐడియా డేటా ఛార్జీలు 90% వరకు తగ్గింపు!

నవంబర్ 15 నుంచి 6 నెలల పాటు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని సంస్థ వివరించింది. ప్రస్తుతమన్న ఐడియా ప్రీపెయిడ్ యూజర్లు, కొత్త కనెక్షన్ తీసుకోయే ఇడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఖాతాదారులు ఇంకా ఐడియా 3జీ డాంగిల్స్‌ను ఉపయోగించుకునే వారు ఈ కొత్త ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు. అమలుపరిచే ఆఫర్ లో భాగంగా ఇక పై 2జీలో 10కేబీ డేటాకు 2 పైసలు మాత్రమే ఛార్జ్ చేస్తామని సంస్థ తెలిపింది.

ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ కస్టమర్ల కోసం ‘పాంచ్ కా దమ్' పేరుతపేరుతో రూ.5 విలువతో కూడిన అయిదు రకాల వాయిస్ పథకాలను ఆంధ్రప్రదేశ్ వినయోగదారుల కోసం ప్రకటించింది. ఈ ఐదు పథకాల్లో వినియోగదారులు ఏదైనా ఒకపథకాన్ని ఎంచుకోవాలి. పథకాన్ని బట్టి 10 నుంచి 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఉచిత కాలింగ్, ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్‌కు 6 సెకన్లకు ఒక పైసా, అన్ని లోకల్ కాల్స్ 2 సెకన్లకు 1 పైసా, లోకల్ ఇంకా ఎస్టీడీ కాల్స్ పై 2 సెకన్లకు 1 పైసాను కంపెనీ ఆఫర్ చేస్తుంది.

ఎయిర్‌సెల్ ‘పాంచ్ కా దమ్' ఆఫర్ ఈ ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోదలచిన ఎయిర్‌సెల్ వినియోగదారులు 15105కు కాల్ చేసి ప్యాక్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పేపర్ రీఛార్జ్ పైనా పాంచ్ కా దమ్ ప్యాక్ లభ్యమవుతోంది. ఐడియా సెల్యూలర్ కూడా ఇదే తరహా ప్యాక్‌ను ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సర్కిల్‌లో గతేడాదితో పోలిస్తే డేటా వినియోగం రెట్టింపు అయినట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఏపీ సర్కిల్‌లో 45శాతం మేర తమ వినియోగదారులు డేటా ప్యాక్‌లను వినియోగించుకుంటున్నట్లు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ దీపేందర్ తివానా తెలిపారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot