ఆ అధికారిక ప్రకటనకు ఐడియా సన్నద్ధం..?

Posted By: Prashanth

ఆ అధికారిక ప్రకటనకు ఐడియా సన్నద్ధం..?

 

ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఐడియా తన సరికొత్త డ్యూయల్ సిమ్‌ఫోన్ ‘ఐడియా ఐడీ 918’కు సంబంధించి కీలక వివరాలను శుక్రవారం ప్రకటించనుంది. ఐడియా నుంచి ఇప్పటి వరకు ‘ఐడియా బ్లేడ్’, ‘ఐడియా ఐడీ 280’ మోడళ్లలో రెండు ఫోన్‌లు విడుదలయ్యాయి. తాజాగా ప్రవేశపెట్టబోతున్న ఫోన్ మూడవది కావటంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ డివైజ్ ఫీచర్లు క్లుప్తంగా....

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

- 3.2 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

- 3.2 మెగా పిక్సల్ కెమెరా,

- 150ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్,

- 512 ఎంబీ ర్యామ్,

- మైక్రోఎస్టీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకోవచ్చు,

- 3జీ కనెక్టువిటీ, వై-ఫై సపోర్ట్,

- జీపీఎస్ క్యాపబులిటీ,

- బ్లూటూత్,

- యూఎస్బీ కనెక్టువిటీ,

- 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

- ధర రూ.5,994.

ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై రూ.2340 విలువ చేసే ప్రయోజనాలను ఐడియా కల్పిస్తుంది.

పెద్దల ఫోన్ ‘వొడాఫోన్ 155’

ప్రముఖ టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ సంస్థ పెద్ద వయస్కులకు మరింత అనువుగా ఉండేదుకు గాను సాధారణ మొబైల్ ఫోన్‌ను రూపొందించింది. ధర కేవలం రూ.1800. కాలింగ్ అదేవిధంగా సందేశాలు పంపుకునేందుకు ఈ మొబైల్ పూర్తి స్ధాయిలో దోహదపడుతుంది.

‘వొడాఫోన్ 155’ మోడల్లో డిజైన్ కాబడిన ఈ ఫోన్ ఫీచర్లు:

* బ్యాటరీ స్టాండ్ బై 29రోజులు,

* టాక్ టైమ్ 600నిమిషాలు,

* ఇంటర్నల్ మెమెరీ 0.3 ఎంబీ,

* 2జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఎస్‌వోఎస్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ వ్యవస్థ,

* నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ,

* హై వాల్యుమ్ రింగ్‌టోన్స్.

ఏంటీ SOS ఫీచర్..?

డివైజ్‌లో ఏర్పాటు చేసిన SOS అప్లికేషన్ వినియోగదారుడి భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అత్యవసర సమయంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఉపయోగించుకునే విధానం: ఎమర్జన్సీ సమయంలో వినియోగదారుడు ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన చిన్న బటన్ ప్రెస్ చేసి కొద్ది సేపు ఉంచాలి, తద్వారా అలర్ట్ సౌండ్ ఉత్పన్నమవుతుంది. అంతే కాదు సదురు వ్యక్తికి ఆప్తులైన నలుగురికి సందేశం రూపంలో హెచ్చరికలు పంపుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot