ఐడియా నుంచి రెండు 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

భారతదేశపు 3వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ ఐడియా సెల్యులార్ (Idea Cellular) రెండు సరికొత్త 3జీ స్మార్ట్‌ఫోన్‌లతో ముందుకొచ్చింది. ఐడియా అల్ట్రా+ (Idea Ultra+ ), ఐడియా ఫ్యాబ్ (Idea Fab) మోడళ్లలో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇడియా మార్కెట్లో ఆవిష్కరించింది. ఐడియా అల్ట్రా+ ధర రూ.8,300, ఐడియా ఫ్యాబ్ ధర రూ.4,999.

ఐడియా నుంచి రెండు 3జీ స్మార్ట్‌ఫోన్‌లు

ఐడియా అల్ట్రా+ కీలక ఫీచర్లు... 5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x 854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,1.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్.

ఐడియా ఫ్యాబ్ కీలక ఫీచర్లు... 5 అంగుళాల డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా. ఫోన్ ఇతర ఫీచరర్లను ఐడియా వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రా, గోవా, మధ్యప్రేదేశ్, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తర ప్రదేశ్ (వెస్ట్) ఇంకా పంజాబ్ ప్రాంతాల్లోని అన్ని ప్రముఖ ఐడియా రిటైల్ స్టోర్‌ల వద్ద ఈ ఫోన్‌లు లభ్యంకానున్నాయి. ఈ 3జీ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు పై ఐడియా 3జీ యూజర్లు 1.6జీబి 3జీ డేటాతో పాటు 3 నెలల ఫ్రీ ఐడియా టీవీ ప్యాక్‌ను ఆస్వాదించవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot