జియో ఫోన్‌కు పోటీగా ఐడియా ఫోన్ వస్తోంది
జియో చౌక 4జీ ఫీచర్ ఫోన్ విడుదల చేయనున్నందున, తానూ పోటీపడేందుకు ఐడియా సెల్యులార్ సన్నాహాలు చేస్తోంది.
జియో చౌక 4జీ ఫీచర్ ఫోన్ విడుదల చేయనున్నందున, తానూ పోటీపడేందుకు ఐడియా సెల్యులార్ సన్నాహాలు చేస్తోంది. ఫోన్ల ధరలను తగ్గించేందుకు తయారీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అయితే మొబైళ్లపై ఎటువంటి రాయితీలు అందించబోమని స్పష్టం చేసింది. 'మొబైళ్ల తయారీ ఖర్చులను తగ్గించడం ద్వారా, వాటి ధరలు దిగొచ్చేలా చేయడానికి కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. అప్పుడే జియోతో పోటీపడే విధంగా అందుబాటు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాగలం' కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు.

రూ.2,500కే
ఐడియా నుంచి రానున్న కొత్త ఫోన్‌ను రూ.2,500కే యూజర్లు సొంతం చేసుకోవచ్చట. ఈ మేరకు ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా తెలిపారు.

డ్యూయెల్ సిమ్
ఇక ఈ ఫోన్ డ్యూయెల్ సిమ్ తో రానుందని సమాచారం. ఒక సిమ్ 2జికి మరో సిమ్ 4జికి సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని ఐడియా చెబుతోంది.

సరికొత్త అప్లికేషన్లతో
సరికొత్త అప్లికేషన్లతో యూజర్లను ఆకట్టుకునే విధంగా ఈ ఫోన్ రానుందని అప్పుడే టెక్ వర్గాలు అంచనాకు వచ్చాయి.

ఫీచర్లు కూడా
ఫీచర్లు కూడా జియో ఫోన్ కి ధీటుగానే ఉంటాయని సమాచారంం. రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తో జియో ఫోన్ రానుందనే విషయం అందరికీ తెలిసిందే.

జియో నుంచి రానున్న ఫోన్ లో
జియో నుంచి రానున్న ఫోన్ లో 2.4 ఇంచ్ డిస్ ప్లే ,ఎఫ్ ఎమ్ రేడియో, టార్చ్, హెడ్ ఫోన్ జాక్, ఎస్ డి కార్డ్ స్లాట్ తో పాటు జియో యాప్స్ కూడా ఉంటాయి.


Click it and Unblock the Notifications








