ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

Posted By:

ఐఎఫ్ఏ 2014 టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా సామ్‌సంగ్, సోనీ, ఎల్‌జీ, ఆసుస్ వంటి ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త  స్మార్ట్‌వాచ్‌ను ప్రపంచానికి పరిచయం చేసాయి. ఈ ప్రతిష్టాత్మక టెక్నాలజీ ప్రదర్శనను పురస్కరించుకుని సామ్‌సంగ్, సిమ్ కనెక్టువిటీ సామర్థ్యంతో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ గేర్ ఎస్‌ను ఆవిష్కరించింది. మరో వైపు ఎల్‌జీ, జీ వాచ్ ఆర్ పేరుతో ఆండ్రాయడ్ వేర్ ప్లాట్‌ఫామ్ పై స్పందించే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ను ప్రకటించింది. జపాన్ బ్రాండ్ సోనీ ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే స్మార్ట్‌వాచ్ 3ని ప్రదర్శించి ఆకట్టుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఐఎఫ్ఏ 2014 కనువిందు చేసిన 5 స్మార్ట్‌వాచ్‌ల వివరాలను మీతో షేర్ చేసకుంటున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Gear S

ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

Samsung Gear S

ఐఎఫ్ఏ 2014 వేదికగా సామ్‌సంగ్ తన కొత్త వర్షన్ స్మార్ట్‌వాచ్ గేర్ ఎస్‌ను ఆవిష్కరించింది. 2 అంగుళాల వంపు తిరిగిన సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 320 x 480పిక్సల్స్)తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్ 3జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. సిమ్ కనెక్టువిటీ. టైజన్ ఆపరేటింగ్ సిస్టం పై వాచ్ రన్ అవుతుంది. 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను వాచ్‌లో నిక్షిప్తం చేసారు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్). వాచ్ ప్రత్యేకతలు.. ఫోన్ సమీపంలో లేకున్నా కాల్స్ స్వీకరించేందుకు వీలుగా ఈ స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేసారు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు. నైక్ + రన్నింగ్ అప్లికేషన్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. తద్వారా మీ ఫిట్నెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ ప్రత్యేకతలను కలిగి ఉన్న ఈ స్మార్ట్ వేరబుల్ డివైస్ సామ్‌సంగ్ టైజిన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. డిసెంబర్ నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

LG G Watch R

ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

LG G Watch R

ఫోన్ సమీపంలో లేకున్నా కాల్స్ స్వీకరించేందుకు వీలుగా ఈ స్మార్ట్‌వాచ్‌ను డిజైన్ చేసారు. జీ వాచ్ ఆర్ స్మార్ట్‌వాచ్ గుండ్రటి వృత్తాకార డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫీచర్లు.. 1.3 అంగుళాల ప్లాస్టిక్ ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 320 పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను ఈ వాచ్ కలిగి ఉంది.

 

Sony SmartWatch 3

ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

Sony SmartWatch 3

ఐఎఫ్ఏ 2014 వేదికగా సోనీ తన కొత్త వర్షన్ స్మార్ట్‌వాచ్ 3ను  ఆవిష్కరించింది. పటిష్టమైన వాటర్ ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 1.6 అంగుళాల డిస్‌ప్లే (రిస్యలూషన్ 320 x 320పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ప్రత్యేకమైన వాక్‌మెన్ అప్లికేషన్‌ను ఈ వాచ్‌లో సోనీ నిక్షిప్తం చేసింది. 420 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ. లైఫ్ లాగ్ పేరుతో ప్రత్యేకమైన హెల్త్ ఇంకా లైఫ్‌స్టైల్ అప్లికేషన్‌ను సోనీ ఈ వాచ్‌లో నిక్షిప్తం చేసింది.

 

Sony SmartBand Talk

ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

Sony SmartBand Talk

స్మార్ట్ బ్యాండ్ టాక్ పేరుతో సరికొత్త ఫిట్నెస్ ట్రాకర్‌ను ఐఎఫ్ఏ 2014 వేదికగా సోనీ ఆవిష్కరించింది. 1.4 అంగుళాల ఈ-ఇంక్ డిస్‌ప్లేను ఈ బ్యాంగ్ కలిగి ఉంది. వాటర్ ప్రూఫ్ సెక్యూరిటీతో లభ్యమవుతోన్న ఈ బ్యాండ్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ ఆప్షన్‌లలో లభ్యంకానుంది. ఈ బ్యాండ్ కేవలం ఫిట్నెస్ ట్రాకర్‌లా మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా బ్యాండ్ నుంచే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు.

 

Asus ZenWatch

ఐఎఫ్ఏ 2014: ఆకట్టుకున్న 5 స్మార్ట్‌వాచ్‌లు

Asus ZenWatch

అసుస్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ జెన్ వాచ్‌ను ఐఎఫ్ఏ 2014 వేదికగా ఆవిష్కరించింది. ఈ వాచ్ ఆసుస్ జెన్ యూజర్ ఇంటర్ ఫేస్ పై స్పందిస్తుంది. 1.63 అంగుళాల వంపు తిరిగిన సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిస్యల్యూషన్ 320×320పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, బ్లూటూత్ కనెక్టువిటీ, గుండె వేగాన్ని బైయో సెన్సార్‌ను ఈ వాచ్‌లో అమర్చారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
IFA 2014: 5 Hottest Wearables Launched for September. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot