ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

Posted By:

ప్రతిష్టాత్మక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ షో ‘ఐఎఫ్ఎ 2014' బెర్లిన్ వేదికగా ఈ వారంలో ప్రారంభంకాబోతోంది. సెప్టంబర్ 5వ తేదీన ప్రారంభమై 6 రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు మొదలుకుని స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్ పీసీలు, వంటింటి ఉపకరణాలతో పాటు అనేకమైన ఆసక్తికరమనై కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు టెక్ ప్రపంచాన్ని కనువిందు చేయనున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు వీటిని ప్రదర్శిస్తాయి.

గతేడాది నిర్వహించిన ఐఎఫ్ఎ 2013 కార్యక్రమానికి దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అప్పటి ప్రదర్శనలో సామ్‌సంగ్ తన మొట్టమొదటి స్మార్ట్‌వాచ్ గెలాక్సీ గేర్‌తో గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసంది. ఐఎఫ్ఎ 2014లోనూ తన సత్తాను చాటుకునేందుకు సామ్‌సంగ్ తహతహలాడుతోంది. ఈ ఏడాది ప్రదర్శనలో భాగంగా గెలాక్సీ నోట్ 4ను సామ్‌సంగ్ పరిచయం చేయబోతోంది.

సామ్‌సంగ్ తరువాతి స్థానంలో నిలిచిన సోనీ, ఐఎఫ్ఎ 2014 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ షోను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రదర్శనలో భాగంగా ఎక్స్‌పీరియా జెడ్3, ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్, ఎక్స్‌పీరియా టాబ్లెట్ జెడ్3 కాంపాక్ట్, స్మార్ట్‌వాచ్ 3, స్మార్ట్‌బ్యాండ్ టాక్‌ను సోనీ ఆవిష్కరించబోతోంది.

దక్షిణ కొరియాకు చెందిన మరో ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ ఐఎఫ్ఎ 2014ను పురస్కరించుకుని తమ మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ జీ వాచ్ ఆర్‌తో పాటు ఎల్‌జీ జీ3 స్టైలస్ ఫాబ్లెట్ మరికొన్ని చవక ధర ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించబోతోంది.

చైనాకు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీలైన లెనోవో, హవాయిలు సైతం ఐఎఫ్ఎ 2014కు ముస్తాబవుతున్నాయి. ఈ ప్రదర్శన వేదికగా ఆండ్రాయిడ్ ఎల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే వైబ్ జెడ్2 స్మార్ట్‌ఫోన్‌ను లెనోవో ప్రదర్శించే అవకాశముందని ఓ అంచనా. మరోవైపు హవాయి అసెండ్ మేట్ 7 పేరుతో తన ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను ఆవిష్కరించబోతోంది.

మైక్రోసాఫ్ట్ డివైసెస్ విభాగంలో ఓ భాగంగా పనిచేస్తోన్న నోకియా ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనలో భాగంగా తన లూమియా సిరీస్ నుంచి రెండు సరికొత్త విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్‌లను ప్రదర్శించబోతోంది. లూమియా 730, లూమియా 830 మోడల్స్‌లో ఈ విండోస్ ఫోన్‌లు ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి.

తైవాన్‌కు చెందిన్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనలో భాగంగా తన డిజైర్ సిరీస్ నుంచి పలు మధ్య ముగింపు ఆండ్రాయడ్ హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించబోతోంది.

ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనలో భాగంగా ప్రముఖ ఆవిష్కరణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఎఫ్ఎ 2014లో సామ్‌సంగ్ ఆవిష్కరణలు

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో సామ్‌సంగ్ ఆవిష్కరణలు

సామ్‌సంగ్ ముందస్తు-ఐఎఫ్ఎ 2014 (Pre - IFA 2014) కార్యక్రమాన్ని సెప్టంబర్ 3వ తేదీన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో  గెలాక్సీ నోట్ 3కి సక్సెసర్ వర్షన్ అయిన గెలాక్సీ నోట్ 4ను సామ్‌సంగ్ ఆవిష్కరించబోతోంది. భారత కాలమానం ప్రకారం

సెప్టంబర్ 3వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గెలాక్సీ నోట్ 4 ఫీచర్లు (అంచనా మాత్రమే)... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 5433 స్నాప్‌డ్రాగన్ 805 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ ఐఎస్ఓసెల్ కెమెరా (4కే వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

 

ఐఎఫ్ఎ 2014లో సోనీ ఆవిష్కరణలు

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో సోనీ ఆవిష్కరణలు:

సోనీ ముందస్తు-ఐఎఫ్ఎ 2014 కార్యక్రమాన్ని సెప్టంబర్ 3వ తేదీన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎక్స్‌పీరియా జెడ్ 3,  ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్, ఎక్స్‌పీరియా టాబ్లెట్ జెడ్3 కాంపాక్ట్, స్మార్ట్‌వాచ్ 3, స్మార్ట్‌బ్యాండ్ టాక్‌ను సోనీ ఆవిష్కరించబోతోంది.  భారత కాలమానం ప్రకారం సెప్టంబర్ 3వ తేదీ రాత్రి 8.00 నిమిషాల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

సోనీ ఆవిష్కరణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు క్లిక్ చేయండి.

 

ఐఎఫ్ఎ 2014లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల ప్రదర్శన

మైక్రోసాఫ్ట్ డివైసెస్ విభాగంలో ఓ భాగంగా పనిచేస్తోన్న నోకియా ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనలో భాగంగా తన లూమియా సిరీస్ నుంచి రెండు సరికొత్త విండోస్ ఫోన్ 8.1 స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించబోతోంది. లూమియా 730, లూమియా 830 మోడల్స్‌లో ఈ విండోస్ ఫోన్‌లు ప్రపంచానికి పరిచయం కాబోతున్నాయి. భారత కాలమానం ప్రకారం మైక్రోసాఫ్ట్ కొత్త ఉత్పత్తుల ప్రదర్శన సెప్టంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.

 

ఐఎఫ్ఎ 2014లో లెనోవో ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో లెనోవో ఉత్పత్తుల ప్రదర్శన

చైనాకు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ లెనోవో ఐఎఫ్ఎ 2014 ప్రదర్శన వేదికగా ఆండ్రాయిడ్ ఎల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే వైబ్ జెడ్2 స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించే అవకాశముంది. భారత కాలమానం ప్రకారం లెనోవో కొత్త ఉత్పత్తుల ప్రదర్శన సెప్టంబర్ 4వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.

 

ఐఎఫ్ఎ 2014లో హవాయి ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో హవాయి ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనకు సంబంధించి హవాయి తన నూతన ఉత్పత్తుల ఆవిష్కరణల వివరాలను సెప్టంబర్ 4వ తేదీన వెల్లడించనుంది. భారత కాలమానం ప్రకారం హవాయి నిర్వహించే పాత్రికేయ సమావేశం సెప్టంబర్ 4వ తేదీ సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది.

 

ఐఎఫ్ఎ 2014లో హెచ్‌టీసీ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో హెచ్‌టీసీ ఉత్పత్తుల ప్రదర్శన

తైవాన్‌కు చెందిన్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఐఎఫ్ఎ 2014 ప్రదర్శనలో భాగంగా తన డిజైర్ సిరీస్ నుంచి పలు మధ్య ముగింపు ఆండ్రాయడ్ హ్యాండ్‌సెట్‌లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఓ స్మార్ట్‌వాచ్‌ను కూడా హెచ్‌టీసీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సెప్టంబర్ 4వ తేదీ ఉదయం 11.30 నిమిషాల నుంచి హెచ్‌టీసీ ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుంది.

 

ఐఎఫ్ఎ 2014లో ఆసుస్ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014: కీలక సమాచారం మీ కోసం!

ఐఎఫ్ఎ 2014లో ఆసుస్ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014కు సంబంధించి ఆసుస్ కొత్త ఉత్పత్తుల ప్రదర్శన భారత కాలమానం ప్రకారం సెప్టంబర్ 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్లిక్ చేయండి.

 

ఐఎఫ్ఎ 2014లో ఎల్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014లో ఎల్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

ఐఎఫ్ఎ 2014లో ఎల్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన

దక్షిణకొరియాకు చెందిన మరో ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఎల్‌జీ ఐఎఫ్ఎ 2014ను పురస్కరించుకుని తమ మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ జీ వాచ్ ఆర్‌తో పాటు ఎల్‌జీ జీ3 స్టైలస్ ఫాబ్లెట్ మరికొన్ని చవక ధర ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించబోతోంది. ఎల్‌జీ ఆవిష్కరణలు సెప్టంబర్ 5 నుంచి 10వ తేదీ మధ్య ఉంటాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
IFA 2014: How to Watch Samsung Galaxy Note 4, Sony Xperia, Asus Launch Live [Schedule]. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot