బ్లాక్ ఎడిషన్‌లో బ్లాక్‌బెర్రీ కీవన్

బెర్లిన్ వేదికగా ప్రారంభమైన IFA 2017 టెక్నాలజీ ట్రేడ్ షో ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని TCL కంపెనీ BlackBerry KEYone బ్లాక్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కస్టమర్స్ నుంచి వస్తోన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను మరోసారి మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు టీసీఎల్ తెలిపింది. గతంలో లాంచ్ అయిన బ్లాక్‌బెర్రీ కీవన్ ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే కొత్త వర్షన్‌లో ర్యామ్‌ను 3జీబి నుంచి 4జీబికి, స్టోరేజ్‌ను 32జీబి నుంచి 64జీబికి పెంచారు.

బ్లాక్ ఎడిషన్‌లో బ్లాక్‌బెర్రీ కీవన్

బ్లాక్‌బెర్రీ కీవన్ బ్లాక్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్.. 4.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), 2.5GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ ఐఎమ్ఎక్స్378 సెన్సార్ (ప్రత్యేకతలు : EIS, f/2.0 అపెర్చుర్, 4కే వీడియో రికార్డింగ్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 84 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్, f/2.2 అపెర్చుర్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లుటూత్ 4.2, యూఎస్బీ టైప్-సీ స పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్).

Read More : ప్రీ-ఆర్డర్ పై Redmi 4A..ఇప్పుడు 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్‌తో లభ్యం

English summary
IFA 2017: BlackBerry KEYone Black Edition with 4GB RAM unveiled. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot