మొబైల్ ఫోన్లు కొంపముంచుతున్నాయ్: సర్వే

Posted By: Staff

మొబైల్ ఫోన్లు కొంపముంచుతున్నాయ్: సర్వే

 

మొబైల్‌ఫోన్‌ల ప్రభావం దేశంలోని వ్యాపార సంస్థలకు నష్టం కలిగించేదిగా ఉందని సిమాంటెక్ అధ్యయనం వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వల్ల కంపెనీలకు సంబంధించిన కీలక వివరాలు బయటకు పోక్కడంతో పాటు బ్రాండ్ ఇమేజ్‌కు భంగం వాటిల్లుతుందని ఈ సర్వే కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. సరైన సెక్యూరిటీ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు వాడుతున్న స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల మూలంగా ఒక్కో కంపెనీకి సుమారు రూ.42 లక్షల నష్టం వాటిల్లుతోందని ఈ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ తేటతెల్లం చేసింది.

'2012 స్టేట్ ఆఫ్ మొబిలిటీ సర్వే' పేరుతో సిమాంటెక్ రూపొందించిన సర్వేను ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఎండి (భారత కార్యకలాపాలు) శంతను ఘోష్ బుధవారం విడుదల చేశారు. ఈ సర్వేను 43 దేశాల్లో నిర్వహించామని, ఇందులో భారత్‌లోని 250 కంపెనీలు సహా 6వేల కంపెనీలు పాలుపంచుకున్నట్టు చెప్పారు. చాలా వ్యాపార సంస్థలు తమ కీలక వ్యాపార కార్యకలాపాల ప్రక్రియలను, డేటా పంపకాన్ని మొబైల్ ఫోన్ల ద్వారానే నిర్వహించడం వల్ల కొన్ని భద్రతాపరమైన రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot