మీకు తెలుసా..?

Posted By:

మీకు తెలుసా..?

 

దేశ వ్యాప్తంగా ఉన్న జనవరి నాటికి  ఉన్న జీఎస్ఎం మొబైల్ నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  శుక్రవారం ప్రకటించింది. సీవోఏఐ వెల్లడించిన గణంకాల మేరకు... జనవరిలో కొత్తగా 84.4లక్షల మంది కొత్తగా జీఎస్ఎం నెట్  వర్క్ లో  వినియోగదారులయ్యారు. దీంతో భారత్ లో మొత్తం జీఎస్ఎం మొబైల్ యూజర్ల సంఖ్య 64.8 కోట్లుకు చేరింది.  జనవరిలో అత్యధికంగా యూనినార్‌కు కొత్త మొబైల్ వినియోగదారులు లభించారు. కొత్తగా చేరిన 24.9 లక్షల మందితో కలిపి ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 3.87 కోట్లకు పెరిగింది. 17.4 లక్షల మందితో ఐడియా సెల్యులార్ మొత్తం వినియోగదారుల సంఖ్య 10.8 కోట్లకు ఎగబాకింది. భారతీ ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది కొత్త యూజర్లు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 17.69 కోట్లకు చేరింది. 8.5 లక్షల మంది చేరికతో వొడాఫోన్ మొత్తం వినియోగదారుల సంఖ్య 14.86 కోట్లకు పెరిగింది.బీఎస్‌ఎన్‌ఎల్‌కు 8.6 లక్షల మంది, ఎయిర్‌సెల్‌కు 8.1 లక్షల మంది కొత్త యూజర్లు లభించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot