రూ.499కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్!

రూ.251కే స్మార్ట్‌ఫోన్ అంటూ నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఫ్రీడం 251 పేరుతో ఓ కారుచౌక ఫోన్‌ను లాంచ్ చేసి వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే జైపూర్‌కు చెందిన డాకోస్ అనే రూ.888 ధర వేరియంట్‌లో డాకోస్‌ఎక్స్1 పేరుతో ఓ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

Read More: ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఛాంప్1ఇండియా

ఈ ఫోన్ గురించి కూడా అనేక చర్చలు జరిగాయి. ఈ ఫోన్ లాంచ్ అయిన కొద్ది రోజుల తరువాత ఛాంప్1ఇండియా అనే కంపెనీ రూ.501కే స్మార్ట్‌ఫోన్ అంటూ దూసుకొచ్చింది.

ఫ్రీడం 251తో పోలిస్తే..

ఛాంప్‌వన్ సీ1 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ఫ్రీడం 251తో పోలిస్తే మెరుగైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న కారు చౌక స్మార్ట్ ఫోన్ ల జాబితాలోకి తాజాగా మరో ఫోన్ వచ్చి చేరింది.

కోయంబత్తూరుకు చెందిన వోబిజెన్ మొబైల్స్

కోయంబత్తూరుకు చెందిన వోబిజెన్ మొబైల్స్ అనే కంపెనీ Vobizen Wise 5 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. ధర రూ.499. యునికోయిడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ఆన్‌లైన్ సెల్లర్ ద్వారా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నట్లు సంస్థ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రత్యేక డిస్కౌంట్ పై..

వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.3,499 అట. ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నట్లు సంస్థ చెబుతోంది.

ఆర్డర్ చేసుకున్న వారికి

ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి 22 నుంచి 28 రోజుల్లో ఫోన్ డెలివరీ ఉంటుందని Vobizen వెబ్ సైట్ చెబుతోంది. గ్రే, ఎల్లో ఇంకా వైట్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉండే Vobizen Wise 5 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

స్పెసిఫికేషన్స్..

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0 పోర్ట్, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సార్).

పాఠకులకు ముఖ్య గమనిక

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ ఫోన్ ఆన్‌లైన్ ఛానల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో లేదు. ఈ వైబ్‌సైట్‌లో బుక్ చేసే ఫోన్ పై పూర్తి బాధ్యత మీదే. ఒకవేళు ఇప్పటికే మీరు Vobizen Wise 5 పొందినట్లయితే ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మాతో షేర్ చేసుకోగలదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
India based company launches Android Smartphone for Rs 499. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot