ఇంటర్నెట్ వినియోగంలో అమెరికాను అధిగమించనున్న భారత్!

Posted By:

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ నాటికి ఇండియా 205మిలియన్ ల ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉన్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ), ఐఎమ్ఆర్‌బి ఇంటర్నేషనల్ సంస్థలు తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. ఏడాది ముగింపునాటికి ఈ సంఖ్య 213 మిలియన్ లకు చేరుకునే అవకాశముందని ఈ సంస్థలు విశ్లేషించాయి.

ఇంటర్నెట్ వినియోగంలో అమెరికాను అధిగమించనున్న భారత్!

ప్రస్తుతం, అంతర్జాతీయంగా ఇండియా మూడవ అతిపెద్ద ఇంటర్నెట్ యూజర్ బేస్ కలిగిన దేశంగా వెలుగుతోంది. 300 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలవగా, 207 మిలియన్ యూజర్లతో యూఎస్ రెండో స్థానంలో ఉంది.

దేశంలో ఇంటర్నెట్ విస్తరించిన తీరును పరిశీలించినట్లియతే...రూరల్ ఇండియాతో పోలిస్తే అర్బన్ ఇండియా అత్యధిక మంది ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉంది. ఐఏఎమ్ఏఐ నివేదికల మేరకు అర్బన్ ఇండియా అక్టోబర్ నాటికి 137 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉంది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 141 మిలియన్లకు చేరుకునే అవకాశముంది. రూరల్ ఇండియా అక్టోబర్ నాటికి 68 మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లను కలిగి ఉంది. డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 70 మిలియన్లకు చేరుకునే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot